News January 25, 2025
నస్రుల్లాబాద్: ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ

ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే ఓ మహిళ హత్య చేసింది. ఈఘటన KMR జిల్లా నస్రుల్లాబాద్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. నెమ్లి గ్రామానికి చెందిన టేకుర్ల మైసయ్య (40) నలభై రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కాగా ఈనెల 21న అతని భార్య రాధ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. ప్రియుడితో కలిసి భర్తను కొట్టి చంపి చెరువులో పడేసినట్లు అంగీకరించింది.
Similar News
News November 8, 2025
ఇవాళ్టి బంగారం, వెండి ధరలిలా

రెండో శనివారం సందర్భంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,020గా ఉంది. అటు వారం రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.980 తగ్గడం విశేషం. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,11,850గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ. 1,65,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 8, 2025
కృష్ణా: శబరిమలై స్పెషల్ ట్రైన్స్ నడిచే తేదిలివే.!

శబరిమలై వెళ్లేవారికై ఉమ్మడి జిల్లా మీదుగా మచిలీపట్నం (MTM), కొల్లం(QLN) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్స్ NOV 14-NOV 28 వరకు ప్రతి శుక్రవారం MTM-QLN(నం.07101), NOV 16 నుంచి NOV 30 వరకు ప్రతి ఆదివారం QLN-MTM(నం.07102) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో గుడివాడ, విజయవాడతో పాటు ఏపీలోని ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
News November 8, 2025
తుళ్లూరు: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

తుళ్లూరు(M) ఐనవోలు టిడ్కో ఇళ్లలో నివాసం ఉంటున్న చిలకా కోటేశ్వరావు(26) అనే వ్యక్తి శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తెనపల్లికి చెందిన మృతుడు మందడంలోని పని చేస్తూ ఏడాది నుంచి టిడ్కోలో అద్దెకు ఉంటున్నాడు. భార్యతో మనస్పర్థలు రావడంతో ఇంటిలో భార్య ఉండగానే తలుపు గడియ వేసుకొని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు SI కలగయ్య తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


