News January 25, 2025
నస్రుల్లాబాద్: ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ

ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే ఓ మహిళ హత్య చేసింది. ఈఘటన KMR జిల్లా నస్రుల్లాబాద్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. నెమ్లి గ్రామానికి చెందిన టేకుర్ల మైసయ్య (40) నలభై రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కాగా ఈనెల 21న అతని భార్య రాధ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. ప్రియుడితో కలిసి భర్తను కొట్టి చంపి చెరువులో పడేసినట్లు అంగీకరించింది.
Similar News
News February 18, 2025
NTPCలో 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన 400అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 40శాతం మార్కులతో బీఈ, బీటెక్(మెకానికల్, ఎలక్ట్రికల్) పాసై 35ఏళ్లలోపు వయసున్న వారు అర్హులు.రిజర్వేషన్లు అనుసరించి గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు మార్చి 1లోపు careers.ntpc.co.in/recruitment/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
News February 18, 2025
9 మంది ESI ఆస్పత్రి ఉద్యోగులను సస్పెండ్ చేసిన మంత్రి

AP: రాజమహేంద్రవరం ESI ఆస్పత్రిలో 9మంది ఉద్యోగులపై సన్పెన్షన్ వేటు పడింది. కొందరు వైద్యులు, సిబ్బంది విధుల్లో లేకుండా సంతకాలు పెట్టి వెళ్లడాన్ని నిన్నటి ఆకస్మిక పర్యటనలో మంత్రి వాసంశెట్టి సుభాష్ గుర్తించి మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించగా.. రాష్ట్ర బీమా వైద్య సేవల డైరెక్టర్ ఆంజనేయులు ఇవాళ సస్పెండ్ చేశారు. ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్, ముగ్గురు డ్యూటీ డాక్టర్లు తదితరులపై వేటు పడింది.
News February 18, 2025
బ్యాంకర్లు లక్ష్యాలను పూర్తి చేయండి: కలెక్టర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి బ్యాంకర్లకు కేటాయించిన రుణ మంజూరు లక్ష్యాలను 100% పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ పథకాల రుణ మంజూరుపై సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.