News November 29, 2024
నాంపల్లిలో సినీ నటుడు సోనూసూద్
నాంపల్లిలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సందడి చేశారు. ఓ ప్రముఖ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. కార్యక్రమం నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఓ దివ్యాంగ యువతి సోనూ సూద్‌కు ఆయన స్కెచ్ బహుకరించింది. దేశంలో దివ్యాంగులకు తానూ ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Similar News
News December 5, 2024
దిక్షాంత్ పరేడ్‌లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ చంచల్ గూడ సెంట్రల్ జైల్లో సికా పెరేడ్ గ్రౌండ్‌లో జైల్ ట్రైనీ వార్డార్డ్స్ దీక్షంత్ పరేడ్ గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దీక్షంత్ పరేడ్‌లో శిక్షణ పొందిన జైల్ వార్డార్డ్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జైల్ వార్డార్డ్‌కి మెడల్స్ ప్రదానం చేశారు.
News December 5, 2024
ములుగు ఎన్కౌంటర్ బూటకం: ప్రొ. హరగోపాల్
డిసెంబర్ 1న ఏటూరు నాగారం చల్వాక ఎన్కౌంటర్ బూటకమని మావోయిస్టులపై విషహారం ప్రయోగించి, బంధించి, హింసించి చేసిన హత్యాకాండే అని తెలంగాణ పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొ. హరగోపాల్ ఆరోపించారు. NSSలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మార్చి 2026 వరకు నక్సలైట్లను ఏరివేస్తామని స్వయంగా హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారని, అందులో భాగంగానే బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని ఆరోపించారు. నారాయణ రావు ఉన్నారు.
News December 5, 2024
HYD: ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న వర్సిటీ రిజిస్ట్రార్…!
JNTU రిజిస్ట్రార్ తీరు పై వర్సిటీ డైరెక్టర్ లే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వర్సిటీలు డైరెక్టర్లకు కార్లు, డ్రైవర్ల కేటాయింపులో రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు వివక్ష చూపిస్తున్నారని కొందరు డైరెక్టర్లు ఆరోపించారు. బుధవారం రిజిస్ట్రార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈవిషయం చర్చకు రాగా సమావేశం కాస్త రసాభాసగా మారింది. వర్సిటీలో పాలనాపరంగా రిజిస్ట్రార్ ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారని ఆరోపించారు.