News February 11, 2025

నాంపల్లి: జబల్‌పూర్ ప్రమాద ఘటనపై కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి

image

జబల్‌పూర్‌లో జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో ఏడుగురు హైదరాబాద్ వ్యక్తులు మృతిచెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి.. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని కోరినట్లు తెలిపారు. గాయపడిన ఇద్దరికి సరైన చికిత్స అందించాలని సూచించామన్నారు.

Similar News

News September 19, 2025

తాండూరు: భారీ డిస్కౌంట్‌ వలలో పడకండి: డీఎస్పీ

image

తక్కువ ధరలకే వస్తువులంటూ సోషల్‌ మీడియాలో వచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని తాండూర్‌ డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచించారు. భారీ డిస్కౌంట్‌ ప్రకటనల వెనుక సైబర్‌ మోసగాళ్లు ఉంటారని హెచ్చరించారు. రూ. లక్షలు విలువ చేసే వస్తువులు తక్కువ ధరకు వస్తాయని ఆశపడి మోసపోవద్దని, రూ.999కే ఐఫోన్‌ వంటివి నకిలీ ప్రకటనలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు లోగోను విడుదల చేశారు.

News September 19, 2025

పోలీస్ కస్టడీకి మిథున్ రెడ్డి.. విజయవాడకు తరలింపు

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడకు తరలించారు. ఆయన్ను 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరగా కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ను అధికారులు ఇవాళ, రేపు విచారించనున్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే.

News September 19, 2025

గజ్వేల్: కొమ్మ కొమ్మకో గూడు..

image

గజ్వేల్‌లో ఈత చెట్టు కొమ్మలకు ఉన్న గూళ్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పక్షులు అద్భుత నైపుణ్యంతో కట్టుకున్న ఈ గూళ్లు వద్ద సందడి చేస్తున్నాయి. ఈ దృశ్యం పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం ఆవశ్యకతను గుర్తుచేస్తుంది. గజ్వేల్ పట్టణం నుంచి సంగాపూర్ వెళ్లే దారిలో గజ్వేల్ బాలికల విద్యాసౌధం సమీపంలో ఈత చెట్టు కొమ్మలకు పక్షులు కట్టుకున్న గూళ్లు కనువిందు చేస్తున్నాయి.