News December 19, 2024

నాంపల్లి: రతన్ టాటా జయంతి.. వ్యాసరచన పోటీలు..!

image

రతన్ టాటా జయంతి సందర్భంగా ఈనెల 23వ తేదీన విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని సరోజినీ నాయుడు వనిత విద్యాలయంలో ఈ పోటీలు ఉంటాయన్నారు. నగరంలోని వివిధ కళాశాలలో చదివే విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. 28న బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు.

Similar News

News January 17, 2025

HYD: చేవెళ్లలో త్వ‌ర‌లో ఉపఎన్నిక: కేటీఆర్

image

చేవెళ్ల నియోజ‌కవ‌ర్గంలో త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక రాబోతుంద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం మోసాల‌ను రైతులు, ఆడ‌బిడ్డ‌లు ఎండ‌గట్టాల‌ని కేటీఆర్ సూచించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఏర్పాటు చేసిన రైతు ధ‌ర్నాలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. చేవెళ్లకు త్వ‌ర‌లో ఉప ఎన్నిక రాబోతోందని KTR వ్యాఖ్యలపై మీరేమంటారు. కామెంట్ చేయండి.

News January 17, 2025

ఇబ్రహీంపట్నం: కూతురు వరసయ్యే బాలికపై అత్యాచారం

image

కూతురు వరసైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల కథనం.. తుర్కయంజాల్‌కు చెందిన ఆంజనేయులుకు వరుసకు కూతురయ్యే బాలిక పుట్టినరోజు సందర్భంగా కొత్త బట్టలు కొనిస్తానని ఇంట్లో చెప్పి తుర్కయంజాల్‌లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అనంతరం బాలిక కేకలు వేస్తూ బయటకు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు.

News January 17, 2025

రంగారెడ్డి జిల్లా వెదర్ అప్డేట్ @ AM

image

రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. చందనవెల్లిలో 13.5℃, రెడ్డిపల్లె 14.2, కాసులాబాద్, తాళ్లపల్లి 14.3, షాబాద్, చుక్కాపూర్, ఎలిమినేడు 14.6, మీర్‌ఖాన్‌పేట 14.7, కడ్తాల్, రాచూలూరు 15, HCU, ఆరుట్ల 15.1, కేతిరెడ్డిపల్లి, ఇబ్రహీంపట్నం 15.2, యాచారం, శంషాబాద్, రాజేంద్రనగర్, గునగల్ 15.3, దండుమైలారం 15.5, తొమ్మిదిరేకుల, సంగం 15.6, అమీర్‌పేట 15.6, కందువాడలో 15.7℃గా నమోదైంది.