News December 17, 2024
నాకు ఆ కోరిక మిగిలిపోయింది:పొంగులేటి
మంత్రి పొంగులేటి అసెంబ్లీ చిట్ చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనతో కూర్చొని మాట్లాడాలనే కోరిక నాకు వ్యక్తిగతంగా ఉందని’ ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఏడాది కాలంపై ఎలాంటి వ్యతిరేకత లేదు.. వైఎస్ఆర్ సమయంలో ఇలానే ప్రచారం జరిగిందని గుర్తుచేశారు. 2,3 ఏళ్ళల్లో అన్ని సర్దుకుంటాయన్నారు. అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీనే రాష్ట్రంలో అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
Similar News
News January 21, 2025
ఖమ్మం మార్కెటుకు పోటెత్తిన మిర్చి
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మిర్చి పోటెత్తింది. దాదాపు 30 వేల బస్తాలను రైతులు విక్రయానికి మార్కెట్‌కు తీసుకువచ్చారు. ఈ కొత్త సంవత్సరంలో ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు. ఈ నెల రెండోవారంలో 10 వేలు, సంక్రాంత్రి తర్వాత 16న 15 వేల బస్తాల మిర్చి వచ్చిందన్నారు. నిన్న దానికి రెట్టింపు వచ్చిందని పేర్కొన్నారు. మిర్చి విక్రయాలు పెరుగుతున్న ధరలో మాత్రం పురోగతి లేదని రైతులు చెబుతున్నారు.
News January 20, 2025
ఇల్లందు: గుండెపోటుతో స్కూల్‌లోనే టీచర్ మృతి
ఇల్లందులోని జేబీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రమేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. సోమవారం పాఠశాలలో విధులకు హాజరైన ఆయన ఛాతీలో విపరీతమైన నొప్పి రావడంతో కుప్పకూలాడని సిబ్బంది తెలిపారు. అంబులెన్సులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారన్నారు. రమేశ్ మృతి పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News January 20, 2025
కూసుమంచి గణపేశ్వరాలయం చరిత్ర ఇదే..!
కూసుమంచి గణపేశ్వరాలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ 11-12వ శతాబ్దంలోని కాకతీయుల కాలంలో వెయ్యిన్నొక్కటి శివాలయాల నిర్మాణ క్రమంలో గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివలింగాల్లో ఒకటి. ఆలయ నిర్మాణం ఓ చేయి, కాలు లేని శిల్పి చేశాడనేది ప్రచారంలో ఉంది. ప్రతి శివరాత్రికి ఖమ్మంతో పాటు నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.