News March 20, 2024
నాకు ఇవే చివరి ఎన్నికలు: మాజీ మంత్రి అయ్యన్న
తనకు ఇవే చివరి ఎన్నికలని.. గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని ఇవ్వాలంటూ నర్సీపట్నం నియోజకవర్గ TDP అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రజలను కోరారు. బుధవారం రామన్నపాలెం పంచాయతీ శివారు వెంకయ్యపాలెంలో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. టీడీపీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News September 7, 2024
సరుకు రవాణాలో సత్తా చాటుతున్న విశాఖ పోర్టు
సరుకు రవాణాలో విశాఖ పోర్టు సత్తా చాటుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. గత ఏడాది 35 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేయడానికి 163 రోజులు పట్టగా ఈ ఏడాది 149 రోజుల్లో ఈ లక్ష్యాన్ని చేరుకున్నట్లు పోర్ట్ ట్రస్ట్ అథారిటీ ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. ఈ ఏడాది 90 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.
News September 7, 2024
కేజీహెచ్‌లో లేజర్ ఆపరేషన్లు
విశాఖ కేజీహెచ్‌లో లేజర్ ఆపరేషన్లు అందుబాటులోకి రానున్నాయి. కోత లేకుండా లేజర్ విధానంలో సకాలంలో శత్రు చికిత్సలు నిర్వహించేలా కేజీహెచ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో విమ్స్ ఆసుపత్రికి లేజర్ వైద్య పరికరాలు అందజేశారు. వీటిని వినియోగించకపోవడంతో కలెక్టర్ అనుమతితో విమ్స్ డైరెక్టర్ రాంబాబు కేజీహెచ్‌లో వీటిని అందజేశారు. దీంతో కేజీహెచ్‌లో లేజర్ ఆపరేషన్లు జరగనున్నాయి.
News September 6, 2024
విశాఖ- మహబూబ్‌నగర్ SF ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్
విశాఖ- మహబూబ్‌నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (12861) ఈరోజు విశాఖపట్నం నుంచి సాయంత్రం 6:40కు బయలుదేరవలసి ఉండగా 5 గంటలు ఆలస్యంగా నడవనుంది. రాత్రి 11:40కు బయలుదేరే రీ షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ట్రైన్ రేపు మధ్యాహ్నం 2:20కు మహబూబ్ నగర్ చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.