News April 24, 2024
నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదు: సుంకర పద్మశ్రీ

తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదని సుంకర పద్మశ్రీ ట్వీట్ చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థినిగా పోటీ చేయాలని ఆశించానని, అధిష్ఠానం అవకాశం కల్పించలేకపోయిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు తన వంతు కృషి చేస్తానన్నారు. తన నిర్ణయాన్ని అధిష్ఠానం మన్నిస్తుందని భావిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు అభ్యర్థిగా పద్మశ్రీని నిన్న కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News December 6, 2025
కృష్ణా జిల్లాలో 12 స్క్రబ్ టైఫస్ పాజిటీవ్ కేసులు: కలెక్టర్

జిల్లాలో 12 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఈ కేసులు నమోదయ్యాయన్నారు. వ్యవసాయ పనులు చేసుకునే గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తుందన్నారు. అనుమానిత, ధృవీకృత కేసులపై ప్రత్యేకంగా ఇంటింటి సర్వేల ద్వారా పర్యవేక్షిస్తునట్లు తెలిపారు.
News December 5, 2025
‘కృష్ణాస్ఫూర్తి’ పేరుతో విజయగాధలను ప్రసారం చేయండి: కలెక్టర్

వివిధ ప్రభుత్వ రాయితీలు వినియోగించుకుని విజయవంతమైన వారి స్ఫూర్తిదాయక విజయగాధలు తయారు చేసి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు ఆఫీస్లో అధికారులతో ఆయన సమావేశమయ్యీరు. ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలను పొంది విజయవంతమైన వ్యక్తులు లేదా ప్రాజెక్టుల కథలను ‘కృష్ణాస్ఫూర్తి’ పేరుతో ప్రతి రోజు వాటిని ప్రసారం చేయాలన్నారు.
News December 5, 2025
ఈ నెల 8న కృష్ణా వర్శిటీలో స్పాట్ అడ్మిషన్లు

కృష్ణా విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్ధుల కోసం ఈ నెల 8వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఎల్. సుశీల ఓ ప్రకటనలో తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షకు హాజరు కానీ వారు, అర్హత సాధించని వారు కూడా అర్హులేనని తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో తమ సర్టిఫికెట్లతో ఈ నెల 8వ తేదీన అభ్యర్ధులు స్వయంగా రిపోర్ట్ చేయాలన్నారు.


