News June 15, 2024

నాకు ప్రాణహాని ఉంది: నిర్మలగిరి డైరెక్టర్ జాన్ పీటర్

image

తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ప్రాణహాని ఉందని దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి డైరెక్టర్ జాన్ పీటర్ భయాందోళన వ్యక్తం చేశారు. కొందరు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇటీవల శ్రీకాంత్ అనే వ్యక్తి ఫోన్ చేసి రూ.10లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు తెలిపారు. డబ్బులు ఇవ్వకుంటే హానికర చర్యలకు పాల్పడతానని, పుణ్యక్షేత్రంపై అసత్య వీడియోలు బయటపెడతానని బెదిరిస్తున్నారని పీటర్ వెల్లడించారు.

Similar News

News October 28, 2025

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో 200 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున, అధికారులు 24 గంటలూ అప్రమత్తతతో ఉండాలని కలెక్టర్ నాగరాణి మంగళవారం గూగుల్ మీట్ ద్వారా సమీక్షలో ఆదేశించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, మండలాలకు పంపిన డ్రోన్స్ వెంటనే వినియోగించాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా తక్షణం పరిష్కరించాలని స్పష్టం చేశారు.

News October 28, 2025

రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్

image

మొంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు, పాఠశాలలకు, అంగన్వాడీలకు కలెక్టర్ చదలవాడ నాగరాణి సెలవు ప్రకటించారు. ఉత్తర్వులను అన్ని విద్యాసంస్థలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. పిల్లలు బయట తిరగనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు.

News October 28, 2025

ప.గో జిల్లాలో 583.8 మి.మీ. వర్షపాతం

image

గడిచిన 24 గంటల్లో జిల్లాలో 583.8 మి.మీల వర్షపాత నమోదు అయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సరాసరి 29.2 మి.మీ కాగా అత్యధికంగా యలమంచలిలో 53.6, నరసాపురంలో 49.6, పాలకొల్లులో 49.2, ఆచంటలో 43.8, మొగల్తూరులో 42.4 మి.మీలు నమోదయింది. అత్యల్పంగా గణపవరం 13.6 మి.మీ, తాడేపల్లిగూడెం 14.0, అత్తిలిలో 16.6 మి. మీ నమోదు అయినట్టు అధికారులు తెలిపారు.