News February 25, 2025

నాగ‌కర్నూల్ చెరువులో మహిళ మృతదేహం

image

నాగర్‌కర్నూల్ పట్టణ సమీపంలోని కేసరి సముద్రం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన సోమవారం సాయంత్రం వెలుగు చూసింది. చెరువులోని బతుకమ్మ ఘాట్ దగ్గర గుర్తుతెలియని మహిళా మృతదేహం కనిపించినట్లు స్థానికులు తెలిపారు. చెరువులోని మహిళా మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News November 8, 2025

టెక్సాస్‌లో కారంచేడు విద్యార్థిని మృతి

image

కారంచేడుకు చెందిన యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23) టెక్సాస్ A&M యూనివర్సిటీలో ఇటీవల పట్టా పొంది తన కుటుంబ సభ్యులకు అండగా నిలవాలన్న కల నెరవేరకముందే శుక్రవారం ఆకస్మికంగా కన్ను మూసింది. రాజ్యలక్ష్మి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తనది వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చేందుకు గో ఫండ్ మీ ద్వారా స్నేహితులు సహాయం కోసం ముందుకు వచ్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 8, 2025

రేపటి నుంచి మద్యం షాపులు బంద్: CP

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు HYD సీపీ సజ్జనార్ వెల్లడించారు. రేపు సా.6 నుంచి ఈ నెల 11న (పోలింగ్ తేదీ) సా.6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఈ నెల 14న కౌంటింగ్ సందర్భంగా ఉ.6 నుంచి 15న ఉ.6 గంటల వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నిర్దేశించిన సమయాల్లో హోటళ్లు, రెస్టారెంట్‌లు, క్లబ్బులు కూడా మూసివేయాలన్నారు.

News November 8, 2025

₹60,799Crతో రోడ్ల నిర్మాణం.. రికార్డు: మంత్రి

image

TG: రాష్ట్రంలో ₹60,799Crతో రోడ్లు నిర్మించనున్నట్లు మంత్రి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డని, RRR నిర్మాణానికి ₹36,000Cr, HYD-VJA హైవే విస్తరణకు ₹10,400కోట్లు, HAM ప్రాజెక్టుకు ₹11,399Cr కేటాయించామన్నారు. ₹8,000Crతో మన్ననూర్-శ్రీశైలం ఎలివేటర్ కారిడార్‌, ₹20,000Crతో ఫ్యూచర్ సిటీ-బందరు పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో డబుల్ రోడ్లు వేస్తామన్నారు.