News March 28, 2024
నాగబాబుతో తిరుపతి అభ్యర్థిపై చర్చ..!

జనసేన తిరుపతి MLA అభ్యర్థి శ్రీనివాసులును వ్యతిరేకిస్తున్న ఆపార్టీ స్థానిక ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మంగళగిరిలో నాగబాబును గురువారం కలిశారు. తిరుపతిలో తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు. త్వరలో తిరుపతిలో పవన్ పర్యటన ఉంటుందని.. ఈ లోపు పరిస్థితులు అంతా చక్కదిద్దుకుంటాయని నాగబాబు ఆయనకు సూచించారు. ఎన్నికల్లో తనకు కీలక బాధ్యతలు ఇవ్వాలని నాగబాబును కోరగా.. అందుకు ఆయన అంగీకారం తెలిపారని కిరణ్ రాయల్ చెప్పారు.
Similar News
News April 22, 2025
మాట నిలబెట్టుకున్న సీఎం: చిత్తూరు ఎంపీ

సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసి మాట నిలబెట్టుకున్నారని చిత్తూరు ఎంపీ దుగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ డీఎస్సీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
News April 21, 2025
CTR: హజ్ యాత్రికులకు ఉచిత వ్యాక్సినేషన్

ముస్లిం సోదరులకు చిత్తూరు జాయింట్ కలెక్టర్ విద్యాధరి శుభవార్త చెప్పారు. హజ్ యాత్రికులకు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించారు. చిత్తూరులోని టెలిఫోన్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి వ్యాక్సినేషన్ మొదలవుతుందని చెప్పారు. యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 21, 2025
తిరుపతి SVU పరీక్షలు వాయిదా

తిరుపతి SVUలో ఈనెల 22, 23వ తేదీల్లో ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెండో, నాల్గో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం అధికారి దామ్లా నాయక్ వెల్లడించారు. మొదటి రెండు రోజులకు సంబంధించిన పరీక్షలను మే 12, 14 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. 24 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.