News February 21, 2025
నాగర్‌కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

తాడూరు మండల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తెలకపల్లి మండలం అనంతసాగర్‌కి చెందిన శ్రీను(42), శేఖర్(30)లు బైక్‌పై హైదరాబాద్ వెళ్తున్నారు. వీరి బైక్‌ని తాడురు సమీపంలోని గుంతకోడూరులో ఓ కారు ఢీకొనగా.. ఇద్దరు కిందపడ్డారు. వీరి పైనుంచి ఆ కారు వెళ్లటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందారు.
Similar News
News December 4, 2025
నాగార్జునసాగర్‌లో సీప్లేన్ ఏర్పాటు చేయాలి.!

ప్రముఖ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో కూడా సీ ప్లేన్ ఏర్పాటు చేయాలని పల్నాడు ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో 10 చోట్ల సీప్లేన్ వాటర్ డోమ్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి మురళీ మోహర్ రాజ్యసభ సభ్యుడు బీదర మస్తాన్ రావు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నాగార్జున కొండ వద్ద సిప్లేన్ ఏర్పాటు చేస్తే పల్నాడులో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది.
News December 4, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.220 తగ్గి రూ.1,30,360కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.200 పతనమై రూ.1,19,500 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 తగ్గి రూ.2,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 4, 2025
NRPT: భయాందోళనకు గురిచేసేందుకే క్షుద్రపూజలు

కోస్గి మండలంలోని మీర్జాపూర్ ఉన్నత పాఠశాలలో క్షుద్రపూజలు విద్యార్థులను భయాందోళన గురి చేసే అందుకే చేసి ఉంటారని పాఠశాల హెచ్ఎం జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇట్టి పూజలు చేసిన ఆకతాయిలకు పోలీసులు గుణపాఠం చెప్తారన్నారు. విద్యార్థులకు ధైర్యం చెప్పి పాఠశాలను కొనసాగించినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.


