News February 21, 2025
నాగర్కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం

తాడూరు మండల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తెలకపల్లి మండలం అనంతసాగర్కి చెందిన శ్రీను(42), శేఖర్(30)లు బైక్పై హైదరాబాద్ వెళ్తున్నారు. వీరి బైక్ని తాడురు సమీపంలోని గుంతకోడూరులో ఓ కారు ఢీకొనగా.. ఇద్దరు కిందపడ్డారు. వీరి పైనుంచి ఆ కారు వెళ్లటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందారు.
Similar News
News October 15, 2025
కార్తిక సోమవారం.. పంచారామాలకు ప్రత్యేక బస్సు

ఖమ్మం: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం RTC ఖమ్మం విభాగం ప్రత్యేక సర్వీసును ప్రకటించింది. ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోటకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతోంది. ఈ నెల 26న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరుతుంది. టికెట్ ధర పెద్దలకు రూ.2,300, పిల్లలకు రూ.1,200గా నిర్ణయించామని, వివరాలకు 91364 46666 నెంబర్ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
News October 15, 2025
సిద్దిపేట: రాష్ట్రస్థాయి పోటీలకు ఆహ్వానం

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థులకు వ్యాసరచన పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు సీపీ విజయ్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల కార్యక్రమాల్లో భాగంగా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాసరచన పోటీల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. Drugs Menace: ‘Role of Police in Prevention and How Students Can Stay Away from Drugs’ అంశంపై 500 పదాల్లో రాసి పంపాలన్నారు.
News October 15, 2025
రోడ్డు ప్రమాదం.. కుటుంబంలో నలుగురు మృతి

TG: కామారెడ్డి(D) భిక్కనూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు తాత, తల్లి, పిల్లలను కబళించింది. ఖమ్మం(D) ముస్తికుంటకు చెందిన వీరు స్కూటీపై వెళ్తుండగా రాంగ్రూట్లో వచ్చిన టిప్పర్ బలంగా ఢీకొట్టింది. తల్లి, ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ తాత, రెండేళ్ల పాపను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.