News February 21, 2025
నాగర్‌కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

తాడూరు మండల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తెలకపల్లి మండలం అనంతసాగర్‌కి చెందిన శ్రీను(42), శేఖర్(30)లు బైక్‌పై హైదరాబాద్ వెళ్తున్నారు. వీరి బైక్‌ని తాడురు సమీపంలోని గుంతకోడూరులో ఓ కారు ఢీకొనగా.. ఇద్దరు కిందపడ్డారు. వీరి పైనుంచి ఆ కారు వెళ్లటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందారు.
Similar News
News March 24, 2025
పబ్లిక్ ఇష్యూకు Meesho

దేశీయ ఇ-కామర్స్ కంపెనీ Meesho పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. బిలియన్ డాలర్ల విలువైన IPO కోసం కొటక్ మహీంద్రా క్యాపిటల్, సిటీ బ్యాంకును లీడ్ బ్యాంకర్లుగా ఎంచుకుందని తెలిసింది. గత ఏడాది $3.9B గా ఉన్న విలువను 2.5 రెట్లకు పెంచి $10Bగా చూపాలని భావిస్తోంది. సేల్స్ పెరుగుతాయి కాబట్టి దీపావళి టైమ్‌లో లిస్టింగ్‌కు రావాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అమెజాన్, ఫ్లిప్‌కార్టుకు మీషో బలమైన పోటీదారుగా అవతరించింది.
News March 24, 2025
సంచలనం.. రూ.50 కోట్ల క్లబ్‌లోకి ‘కోర్ట్’!

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కోర్ట్’ సినిమా సంచలనం సృష్టిస్తోంది. రిలీజైన 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ.50.80 కోట్లు వసూలు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. దాదాపు రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసి భారీ లాభాలను పొందింది. థియేటర్ కలెక్షన్లతో పాటు శాటిలైట్, ఓటీటీ రైట్స్‌కు మరిన్ని లాభాలొచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
News March 24, 2025
అనకాపల్లి కలెక్టరేట్ వద్ద నిర్వాసితుల ఆందోళన

పరిహారం చెల్లించిన తర్వాతే రహదారి పనులు మొదలు పెట్టాలని అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులు అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో రోడ్డు నిర్వాసితుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎస్ బ్రహ్మాజీ, ఆర్ రాము మాట్లాడుతూ టీడీఆర్ బాండ్లు ఇస్తే వీరికి ఉపయోగం లేదన్నారు. బాండ్ల స్థానంలో నగదు చెల్లించాలన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు.