News January 25, 2025
నాగర్కర్నూల్లో డేంజర్ ఫుడ్.!

జిల్లాల్లోని విచ్చలవిడిగా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు. ఇటీవల గద్వాలలో నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ దందాను పోలీసులు పట్టుకున్నారు. ఈనెల11న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ముఠాలో ఒకరు జిల్లాలో ఫ్యాక్టరీ పెట్టి దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. GWL, WNP, NGKL జిల్లాల్లోని చిరు వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తక్కువ ధరకు అమ్మే ఆహార పదార్థాల పట్ల జాగ్రత్త.!
Similar News
News November 25, 2025
హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి: సిద్దరామయ్య

CM మార్పు విషయంలో గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉందని, వారు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని అన్నారు. అధిష్ఠానం నుంచి సిగ్నల్ రాగానే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు తాను పార్టీ నుంచి ఏమీ డిమాండ్ చేయడం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు.
News November 25, 2025
UIDAIలో టెక్నికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(<
News November 25, 2025
నల్గొండ: రైతు భరోసా కోసం రైతుల ఎదురుచూపులు

నల్గొండ జిల్లాలో యాసంగి పంట సాగుకు సిద్ధమవుతున్న 10.82 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకం పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం, యాసంగి పంటలకు కలిపి ప్రభుత్వం ఏటా రూ.12,000 అందిస్తుంది. అయితే, ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో విడుదల కావాల్సిన ఈ యాసంగి సహాయం ఇప్పటివరకు రాకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.


