News February 13, 2025
నాగర్‌కర్నూల్‌లో మహిళ దారుణ హత్య

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మహిళ దారుణ హత్యకు గురైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో శాంతమ్మ(45)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. అత్యాచారం చేసి హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఐ కనకయ్య విచారణ చేపట్టారు. ఈ ఘటన కలకలం రేపుతోంది.
Similar News
News March 24, 2025
హసన్‌పర్తిలో యాక్సిడెంట్.. మృతులు సీతంపేట వాసులు!

HNK జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో చెరువు మూలమలుపు వద్ద టిప్పర్ లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనలో దుర్గం పవన్ కళ్యాణ్ (22), బౌతు మహేష్ (24) అనే <<15861672>>ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి<<>> చెందారు. సీతంపేట గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News March 24, 2025
సిద్ధయ్యగుంటలో యువకుడిపై కత్తితో దాడి

ఏర్పేడు(మ) సిద్ధయ్యగుంటకు చెందిన రవితేజ (23) పై హత్యాయత్నం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన మహేశ్ అనే వ్యక్తి రవితేజపై ఆదివారం కత్తితో దాడి చేశాడు. మహేశ్ కల్లుగీత కార్మికుడు. ఆయన వద్దకు తరుచుగా వచ్చే రవితేజ.. మహేశ్ భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడన్న అనుమానంతో దాడికి తెగబడ్డాడు. గతంలో కూడా వారి మధ్య ఘర్షణలు జరిగినట్టు సమాచారం. చికిత్స కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
News March 24, 2025
విశాఖ రైతు బజార్లలో కూరగాయల ధరలు

విశాఖ 13 రైతు బజార్లలో వ్యవసాయ, వాణిజ్య శాఖ అధికారులు సోమవారం నాటి కూరగాయల ధరలను విడుదల చేశారు.(రూ/ కేజీలలో) టమోటా రూ.15, ఉల్లిపాయలు రూ.23, బంగాళదుంప రూ.15, కాలీఫ్లవర్ రూ.24, దొండకాయలు రూ.28, దోసకాయలు రూ.18/ 26, క్యాప్సికం రూ.40, క్యారెట్ రూ.28 /38 , వెల్లుల్లి రూ.75/90/110, నల్లమిర్చి రూ.28, వంకాయలు రూ.30, బీరకాయలు రూ. 44 , కర్ర పెండ్లం రూ.20, మునగ రూ.32, అనప రూ.14గా నిర్ణయించారు.