News March 18, 2025
‘నాగర్కర్నూల్లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి’

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యారంగానికి బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజినీకాంత్, సయ్యద్, తారాసింగ్, కార్తీక్, రాకేశ్ పాల్గొన్నారు.
Similar News
News October 22, 2025
బలి చక్రవర్తి ఎవరంటే?

బలి చక్రవర్తి రాక్షస వంశంలో జన్మించినప్పటికీ, అపార దాన గుణంతో, పరాక్రమంతో ముల్లోకాలను పరిపాలించాడు. ఈయన భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్త ప్రహ్లాదుడికి మనవడు అవుతాడు. ఆయన దాతృత్వాన్ని, అహంకారాన్ని పరీక్షించడానికి విష్ణువు వామనావతారంలో వచ్చాడు. మూడడుగుల నేలను దానంగా అడిగాడు. బలి తన సర్వస్వం దానం చేశాడు. ఈ దాన గుణాన్ని మెచ్చిన హరి పాతాళ లోకానికి బలిని చక్రవర్తిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు.
News October 22, 2025
సిద్దిపేట: మద్యం మత్తులో తండ్రిని చంపాడు

మద్యం మత్తులో కుమారుడు తండ్రిని హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లికి చెందిన నిజాముద్దీన్ను తన కొడుకు సాతక్ హత్య చేశాడు. మద్యం మత్తులో వారిద్దరి మధ్య గొడవ జరగ్గా సాతక్ తుర్కపల్లి వాటర్ ప్లాంట్ వద్ద బండరాయితో కొట్టి నిజాముద్దీన్ను చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సాతక్తో పాటు అతడి స్నేహితుడు రాజును అరెస్టు చేశారు.
News October 22, 2025
పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎలా వస్తుందంటే?

వైరస్ ద్వారా వ్యాపించే గాలి కుంటువ్యాధి పశువుల్లో ప్రమాదకరమైనది. వర్షాకాలంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తడిగా ఉండే నేలపై గడ్డిమేయడం, కలుషితమైన మేత, దాణా తినడం వల్ల ఈ వైరస్ పశువులకు సోకుతుంది. ఇది అంటువ్యాధి. వైరస్, గాలి ద్వారా ఇతర పశువులకూ వ్యాపిస్తుంది. తల్లిపాల ద్వారా దూడలకు వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ వ్యాధి పశువులకు వచ్చే అవకాశం ఎక్కువ.


