News April 1, 2025

నాగర్‌కర్నూల్: ‘అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి’

image

ఊర్కొండ పేట ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఊరుకొండ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో పవిత్రమైన దేవాలయం వద్ద ఇలాంటి చర్యలకు పూనుకోవడం దుర్మార్గమని, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 2, 2025

ADB: పిల్లలపై ఓ కన్నేయండి!

image

చిన్నారులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ రోజురోజుకు తగ్గిపోతుంది. ఇటీవల ప్రమాదవశాత్తు చిన్నారులు మృతి చెందిన ఘటనలు చాలానే జరిగాయి. నిర్మల్(D) పెంబి (M)లో చిన్నారి నాగపుష్ప(6) ఇంటి కోసం తవ్విన గుంతలో పడి శనివారం మృతిచెందింది. సిద్దిపేట(D) కొండపాకలో కీసర దక్షిత్(2), వికారాబాద్(D) బంట్వారంలో హర్షనందిని(3) ఆడుకుంటూ వెళ్లి బాత్రూం గుంతలో పడి చనిపోయారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

News November 2, 2025

‘బాహుబలి-ది ఎపిక్’ కలెక్షన్లు ఎంతంటే?

image

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ‘బాహుబలి’ రెండు పార్టులు కలిపి ‘బాహుబలి-ది ఎపిక్’ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ తొలి రోజు(OCT 31) థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రూ.19.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా రూ.12.95Cr రాబడితే విదేశాల్లో రూ.6.65 కోట్లు కలెక్ట్ చేసిందని వెల్లడించాయి. మీరు మూవీ చూశారా?

News November 2, 2025

పసుపుతో అందమైన పెదాలు

image

ముఖ సౌందర్యంలో పెదాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేచురల్‌గా అందంగా ఉంచాలంటే ఈ టిప్స్ పాటించండి. * పాలలో చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి పావుగంట మర్దన చేయాలి. రాత్రంతా అలానే ఉంచుకుని ఉదయం నీటితో కడిగేయాలి. * చిటికెడు పసుపులో మూడు చుక్కల నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే కడిగేయాలి.