News April 5, 2025
నాగర్కర్నూల్: ‘అమ్మాయిలు.. జర జాగ్రత్త..!’

యువతులు, మహిళలను వేధింపులకు గురిచేస్తే షీటీంకు ఫిర్యాదు చేయాలని షీటీం NGKL జిల్లా ఇన్ఛార్జి విజయలక్ష్మి సూచించారు. పెంట్లవెల్లి KGBVలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విజయలక్ష్మి మాట్లాడుతూ.. కొత్త పరిచయాలతో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒంటరి ప్రయాణం పరిస్థితుల్లో మంచిది కాదని ఆమె సూచించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోకిరీలు వేధిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News November 23, 2025
సిద్దిపేట: మొదటి మహిళా డీసీసీ అధ్యక్షురాలిగా ఆంక్షారెడ్డి

2014లో సిద్దిపేట జిల్లా ఏర్పడిన తర్వాత మూడు సార్లు డీసీసీ కమిటీ ఏర్పడింది. అందులో మొదటి, 2వ సారి తూంకుంట నర్సారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహారించారు. 3వసారి ఆయన కూతురైన ఆంక్షారెడ్డి నియామకమయ్యారు. ఒక ఫ్యామిలీ నుంచి మూడు సార్లు ఈ పదవి పొందడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను ఆమె ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి!
News November 23, 2025
ఏటూరునాగారం: బియ్యం ఇవ్వాలంటే వాగు దాటాల్సిందే..!

ఏటూరునాగారం మండలంలో కొండాయి, మల్యాల గ్రామాల్లోని గిరిజనులకు జీసీసీ రేషన్ బియ్యం అందించడం విక్రయదారులకు సవాలుగా మారింది. ఈ ప్రాంతంలోని ప్రజలకు బియ్యం ఇవ్వాలంటే సేల్స్మెన్ వినయ్ కుమార్ వాగు దాటి, వేయింగ్ మెషిన్ పట్టుకొని మూడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా ఇదే పరిస్థితి ఉందని వినయ్ తెలిపారు. రవాణా సౌకర్యం లేక ఈ ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.