News January 26, 2025

నాగర్‌కర్నూల్: ఆదర్శంగా రైతు దంపతులు

image

నాగర్‌కర్నూల్ జిల్లా కార్వంగ గ్రామానికి చెందిన లావణ్య, రమణారెడ్డి దంపతులు 24 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రసాయనాలను వాడకుండా, కషాయాలు, ఆవు మూత్రం, పేడతో తయారు చేసిన సేంద్రియ ఎరువులతో వరి, మిర్చి, పసుపు వంటి పంటలు సాగుచేస్తున్నారు. ప్రకృతి, నేల, నీటికి నష్టం చేయకుండా సాగు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Similar News

News October 15, 2025

గూగుల్ రాకపై చిత్తూరు MP ఏమన్నారంటే..?

image

విశాఖలో గూగుల్ ఏర్పాటుతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతమస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు అన్నారు. నూతన ఆవిష్కరణలో సీఎం చంద్రబాబు ముందుంటారని కొనియాడారు. వికసిత భారత్‌లో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందన్నారు. ఏపీ, గూగుల్ మధ్య ఒప్పందం చారిత్రాత్మకమని చెప్పారు. ఈ ఒప్పందంతో విశాఖపట్నం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందన్నారు.

News October 15, 2025

వనపర్తి జిల్లా యువతకు ఎస్పీ సూచనలు

image

బైక్ పై ముగ్గురు ప్రయాణించడం చట్టవిరుద్ధం, అత్యంత ప్రమాదకరమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ట్రిపుల్ రైడింగ్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. చిన్నతప్పిదం ప్రాణాంతక ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుందన్నారు. యువతలు, విద్యార్థులు నిర్లక్ష్యంగా ఇలా ప్రయాణించడం మానుకోవాలని సూచించారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 15, 2025

బిహార్‌‌లో పురుష ఓటర్లదే ఆధిక్యం.. కానీ!

image

బిహార్‌‌లో పురుష ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 3.92 కోట్ల పురుష ఓటర్లు ఉండగా స్త్రీ ఓటర్లు 3.5 కోట్లు ఉన్నారు. ప్రతి 1000 మంది పురుషులకు 892 మంది స్త్రీ ఓటర్ల నిష్పత్తి నమోదైంది. గత ఎన్నికల్లో (899) కన్నా ఇది తగ్గింది. స్త్రీలు తమ భర్తలు ఫారాలు తెచ్చినప్పుడే మాత్రమే ఓటర్లుగా నమోదవుతున్నారు. అయితే ఓటింగ్‌లో మాత్రం చురుగ్గా పాల్గొంటూ ఎన్నికల ఫలితాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని NDA పేర్కొంది.