News March 19, 2025
నాగర్కర్నూల్: ఆ యువకుడు ఆదర్శం..!

ఆ యువకుడు ఓ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. అయినా సమాజానికి ఏదో విధంగా సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. తన కళ్ల ముందు ఎంతో మంది పాము కాటుతో చనిపోతున్నారని గమనించి స్నేక్ క్యాచింగ్ మెలకువలు నేర్చుకున్నాడు. ఆయన నాగర్కర్నూల్ పట్టణానికి చెందిన స్నేక్ క్యాచర్ వంశీ.. ఇప్పటి వరకు సుమారు 50కి పైగా పాములు పట్టుకుని ప్రజల ప్రాణాలు కాపాడాడు. 9703476691 ఈ నంబర్కు కాల్ చేస్తే స్పందిస్తానని తెలిపారు.
Similar News
News November 16, 2025
KTD: మెగా జాబ్ మేళా.. 3వేల ఉద్యోగాల భర్తీ

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కొత్తగూడెం క్లబ్లో మెగా జాబ్ మేళా జరగనుంది. 65 కంపెనీల్లో 3 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీఎండీ బలరాంతో కలిసి ఈ జాబ్ మేళాను ప్రారంభిస్తారు. నిరుద్యోగ యువత కోసం అన్ని ఏర్పాట్లు చేశామని సింగరేణి అధికారులు ప్రకటించారు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
News November 16, 2025
కేశవపట్నం పీఎస్లో సీపీ గౌస్ ఆలం ఆకస్మిక తనిఖీ

కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం శనివారం కేశవపట్నం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణా పనితీరు, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని, వాటికి సంబంధించిన కేసు డైరీలను పరిశీలించారు. దర్యాప్తు వేగవంతం చేయాల్సిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్న అనంతరం, ఠాణా అధికారి ఎస్సై శేఖర్కు సీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
News November 16, 2025
మేడారం జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక: మంత్రి కొండా

మేడారం జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అని మంత్రి కొండా సురేఖ అన్నారు. మేడారం జాతరలో అమ్మవారి గద్దెల చుట్టూ భక్తులు క్యూ-లైన్లలో సాఫీగా వెళ్లేందుకు తయారు అవుతున్న బ్రాస్ గ్రిల్స్ నమూనాను సెక్రటేరియట్లో మంత్రి పరిశీలించారు. మేడారం జాతర ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, జాతర ఏర్పాట్ల విషయంలో ఏ విధంగానూ రాజీ పడొద్దని తెలిపారు.


