News February 13, 2025
నాగర్‌కర్నూల్: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రతి గ్రామంలో ఇల్లు లేని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఎంపీడీవోలను ఆదేశించారు. జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవోలతో అదనపు కలెక్టర్ దేవ సహాయం, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో గోపాల్ నాయక్‌లతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై సమీక్షించారు. ఇళ్లు లేని పేదలకు ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
Similar News
News November 24, 2025
సీ క్లే గురించి తెలుసా?

ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు క్లే మాస్కులు వాడటానికే మొగ్గు చూపుతున్నారు. వీటితో ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. వాటిల్లో ఒకటి సీ క్లే. దీన్నే ఫ్రెంచ్ గ్రీన్ క్లే అని పిలుస్తారు. ఆకుపచ్చ రంగులో ఉండే దీంట్లో ఐరన్ ఆక్సైడ్స్, మెగ్నీషియం, కాల్షియం, కాపర్ వంటి మినరల్స్ కూడా అందుతాయి. మొటిమలు, మచ్చల్ని దూరం చేస్తుంది. ఆయిల్, సెన్సిటివ్ స్కిన్ వారికి ఈ మాస్క్ బాగా పనిచేస్తుంది.
News November 24, 2025
బుచ్చిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసింది రౌడీషీటర్లు..?

బుచ్చిలో గత శనివారం ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వారు నెల్లూరుకు చెందిన రౌడీషీటర్లుగా నిర్ధారించి ఎస్పీ ఆదేశాల మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. హైవేపై కారు డోరు తెరిచి ఉంచడంతో నెల్లూరు నుంచి ఆత్మకూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ కొట్టారు. వెంటనే కారులో ఉన్న వారు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. కారులో బీరు బాటిల్ కూడా దర్శనమిచ్చాయి.
News November 24, 2025
వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్ రద్దు

పరిపాలనాపరమైన కారణాల వల్ల సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతిపత్రాలతో కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె సూచించారు. జిల్లా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, తదుపరి కార్యక్రమాన్ని తెలియజేస్తామని ఆమె వివరించారు.


