News April 21, 2025

నాగర్‌కర్నూల్: ఈనెల 17న పదవీ విరమణ.. ఇంతలోనే విషాదం

image

కల్వకుర్తి పట్టణ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన <<16167214>>పాపిశెట్టి శ్రీనివాసులు<<>> తెలకపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జీహెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెలలో రిటైర్డ్ అవుతున్నందున ఈనెల 17న పదవీ విరమణ కార్యక్రమాన్ని ఆయన ఘనంగా జరిపారు. నాలుగు రోజుల్లోనే మృతిచెందడం ఎంతో బాధాకరమని తోటి ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News April 22, 2025

K.G.Hలో టీచర్లకు వైద్య శిబిరాలు 

image

బదిలీల్లో ప్రాధాన్యత క్యాటగిరీ కిందకు వచ్చే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 24 నుంచి 26 వరకు K.G.Hలో ప్రత్యేక వైద్య శిబిరానికి హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ కోరారు.‌ 24న విశాఖ, 25న అనకాపల్లి, 26న అల్లూరి జిల్లాలకు చెందినవారు వైద్య శిబిరాలకు హాజరు కావాలన్నారు. ఈ శిబిరంలో పొందిన సర్టిఫికెట్ల ఆధారంగా కేటగిరీలను వర్గీకరిస్తామని తెలిపారు.

News April 22, 2025

NRPT: అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెస్: BJP

image

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి అడుగడుగునా అవమానించిందని జిల్లా ఎస్సీమోర్చా ఇంఛార్జి, మాజీ ఎంపీ ముని స్వామి అన్నారు. అంబేడ్కర్ జయంతి వారోత్సవాల సందర్భంగా సోమవారం నారాయణపేటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యంగాన్ని అంబేడ్కర్ ఆశయాలను నెరవేస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

News April 22, 2025

అద్భుతం.. 10Gbps వేగంతో డౌన్‌లోడ్

image

చైనా మరో అద్భుతం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటగా 10Gbps వేగంతో పనిచేసే 10G బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. బీజింగ్ సమీపంలోని హెబీ ప్రావిన్స్‌లో టెస్టు చేయగా 9834 Mbps గరిష్ఠ వేగంతో ఇంటర్నెట్ పని చేసినట్లు చైనీస్ మీడియా వెల్లడించింది. ఈ వేగంతో రెండు ఫుల్ 4k క్వాలిటీ సినిమాలను ఒక్క సెకన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్, టెలీ మెడిసిన్ రంగాలకు ఇది ఎంతో మేలు చేయనుంది.

error: Content is protected !!