News April 10, 2025

నాగర్‌కర్నూల్: ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ 

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ బాదావత్ సంతోష్ సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను, దాని వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. కలెక్టర్ వెంట గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, రవికుమార్, కల్పన తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 5, 2025

నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి: కలెక్టర్

image

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఎల్లారెడ్డిపేట మండలం
రైతు వేదికలో శుక్రవారం ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హాజరై ఎన్నికల నిర్వహణ, వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. పీపీటీ ప్రదర్శన ఇచ్చి ప్రతి అంశంపై వివరించారు.

News December 5, 2025

కూకట్‌పల్లిలో సూర్యాపేట ఓటర్లు.. సిటీలో అభ్యర్థుల పాట్లు.!

image

సూర్యాపేట జిల్లా చిల్పకుంట్ల ఓటర్లు కూకట్‌పల్లిలో దాదాపు 700 మంది ఉంటున్నారు. ఇక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఓట్ల కోసం అక్కడ పోటీచేసే సర్పంచ్ అభ్యర్థులు సిటీకి వచ్చి ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. 3 రోజులుగా ఓటర్లను కలుస్తూ ఏం కావాలో అది చేస్తామని హామీలిస్తున్నారు. ఎల్లమ్మబండ, బాలానగర్, ఫతేనగర్, మూసాపేట ప్రాంతాల్లో పలువురు నివాసముంటున్నారు. ఈనెల 11, 14, 17న ఎన్నికలు జరుగనున్నాయి.

News December 5, 2025

₹72 వేలు చోరీ చేసిన వ్యక్తి TTDకి ₹14 కోట్లు ఎలా కట్టాడు జగన్?: పల్లా

image

AP: TTD పరకామణి చోరీపై YCP చీఫ్ జగన్ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ‘చిన్న చోరీయే. పోయింది ₹72 వేలే’ అని అనడంపై TDP మండిపడుతోంది. ₹72 వేలు చోరీ చేసిన వ్యక్తి తిరిగి TTDకి ₹14CR ఎలా కట్టగలిగాడు? తీసుకోవడానికి సుబ్బారెడ్డి ఎవరు? దొంగిలించిన దానికి అదనంగా డబ్బిస్తే కేసు మాఫీ అవుతుందా? CBIకి ₹70 వేల కోట్లిస్తే మీ కేసులూ మాఫీ చేసేయొచ్చా జగన్!’ అని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు.