News April 1, 2025

నాగర్‌కర్నూల్: ఊర్కొండపేట ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉర్కొండపేటలో మహిళపై జరిగిన అత్యాచార ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, మహిళా సంక్షేమ అధికారులతో సీతక్క మాట్లాడి.. కేసు పురోగతి వివరాలు, బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి అన్ని రకాల సహాయం అందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

Similar News

News April 6, 2025

ఆశ్చర్యకరంగా ధోనీ బ్యాటింగ్ గణాంకాలు

image

ఫినిషర్‌గా గతంలో CSKని ఎన్నో మ్యాచుల్లో గెలిపించిన ధోనీ ప్రస్తుతం తడబడుతున్నారు. నిన్న DCతో జరిగిన మ్యాచే ఇందుకు నిదర్శనం. 2023 సీజన్ నుంచి CSK ఓడిన 14 మ్యాచుల్లో 90.66 avgతో 272 రన్స్ చేసిన ఆయన, జట్టు గెలుపొందిన 13 మ్యాచుల్లో 13.80avgతో 69 రన్స్ మాత్రమే చేశారు. గెలిచిన మ్యాచుల్లో చేసిన రన్స్ కంటే ఓడిన మ్యాచుల్లో చేసిన పరుగులే ఎక్కువగా ఉండటం గమనార్హం.

News April 6, 2025

కామారెడ్డి: రేపటి నుంచి అంగన్వాడీల్లో కంటి పరీక్షలు

image

అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ చైల్డ్ హెల్త్ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ లింబాద్రి తెలిపారు. కామారెడ్డిలోని1,205 అంగన్వాడీల్లో ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి వారికి కావలసిన కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.

News April 6, 2025

కాంగ్రెస్, BRS పార్టీల నిజస్వరూపం బయటపెట్టాలి: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్రంలో రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది BJPయేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. HYDలో BJP ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ అవినీతి పాలన, మజ్లిస్ పార్టీ అధికార దాహం నుంచి, KCR కుటుంబ రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. INC, BRS పార్టీల కుట్రలు, నిజస్వరూపాన్ని బయటపెట్టి BJPని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలి’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

error: Content is protected !!