News March 21, 2025
నాగర్‌కర్నూల్: కరుడుగట్టిన నిందితుడికి రిమాండ్

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని వివిధ మండలాలతోపాటు స్థానికంగా పలు చోరీలకు పాల్పడిన నిందితుడిని రిమాండ్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నియోజకవర్గంలో దొంగతనాలు పెరిగిపోవడంతో జిల్లా పోలీసు అధికారి ఆదేశానుసారం పాలమూరు చౌరస్తాలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులను చూసిన నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని రిమాండ్‌కు పంపించారు.
Similar News
News November 21, 2025
ఫిష్ ఫార్మింగ్‌కు సహకారం అందిస్తాం: కలెక్టర్

ఆర్నమెంటల్ ఫిష్ ఫార్మింగ్‌కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఫిష్ ఫార్మింగ్ రైతులకు హామీ ఇచ్చారు. ఐ.పోలవరం మండలంలోని పెదమడి వద్ద ఆర్నమెంటల్ చేపల పెంపకం కేంద్రాన్ని ఆయన ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజుతో కలిసి పరిశీలించారు. ఎక్వేరియంలో రంగురంగుల ఆర్నమెంటల్ చేపల పెంపకం ద్వారా 22 రకాల జాతుల చేపలను పెంచుతున్నట్లు రైతు వర్మ వారికి వివరించారు.
News November 21, 2025
జాతీయ అథ్లెటిక్ పోటీలకు ‘పుల్లేటికుర్రు’ విద్యార్థిని

జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు జడ్పీహెచ్ స్కూల్ 9వ తరగతి విద్యార్థిని చీకురుమిల్లి హర్షవర్ధని ఎంపికైనట్లు ఇన్ఛార్జ్ HM ధర్మరాజు శుక్రవారం తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-19 రన్నింగ్ పోటీలు జరిగాయన్నారు. ఈ పోటీల్లో హర్షవర్ధని 1500 మీటర్ల రన్నింగ్‌లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందని చెప్పారు.
News November 21, 2025
‘అరటి సాగుచేస్తున్న రైతులను ఆదుకోండి’

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అరటి సాగుచేస్తున్న రైతులను వెంటనే ఆదుకోవాలని CPM నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలో శుక్రవారం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నల్లప్ప, తదితర నాయకులు అరటి పంటలను పరిశీలించారు. గిట్టుబాటు ధర లేక అరటి సాగుచేస్తున్న రైతులు నష్టపోతున్నారని, వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.


