News March 29, 2025

నాగర్‌కర్నూల్: కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు ఇచ్చిన ఎమ్మెల్యే

image

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాజిపేట, బిజ్నిపల్లి, తాడూరు మండలాలకు చెందిన CMRF, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 133 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే Dr.కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందన్నారు. 

Similar News

News November 17, 2025

BRIC-THSTIలో ఉద్యోగాలు

image

BRIC-ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్& టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (<>THSTI<<>>) 10 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, BSc, BCA, డిప్లొమా, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://thsti.res.in/

News November 17, 2025

మూడో భర్తకూ హీరోయిన్ విడాకులు!

image

మలయాళ హీరోయిన్ మీరా వాసుదేవన్ మూడో భర్తకూ విడాకులు ఇచ్చినట్లు సమాచారం. 2025 AUG నుంచి సింగిల్‌గా ఉంటున్నానని ఆమె ఇన్‌స్టాలో పోస్టు చేశారు. మీరా 2005లో విశాల్ అగర్వాల్‌ను పెళ్లాడి ఐదేళ్లకు డివోర్స్ ఇచ్చారు. 2012లో నటుడు జాన్ కొక్కెన్‌ను వివాహం చేసుకోగా ఓ బాబు పుట్టాడు. 2016లో ఆయనకు విడాకులిచ్చి 2024లో కెమెరామెన్ విపిన్‌ను పెళ్లాడారు. కాగా ఈమె తెలుగులో గోల్‌మాల్, అంజలి ఐ లవ్ యూ చిత్రాల్లో నటించారు.

News November 17, 2025

ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన GWMC కమిషనర్

image

గ్రీవెన్స్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని మాట్లాడారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరార్థమై ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. GWMCలో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.