News March 29, 2025

నాగర్‌కర్నూల్: కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు ఇచ్చిన ఎమ్మెల్యే

image

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాజిపేట, బిజ్నిపల్లి, తాడూరు మండలాలకు చెందిన CMRF, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 133 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే Dr.కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందన్నారు. 

Similar News

News April 22, 2025

మెదక్: యువతి అదృశ్యం.. కేసు నమోదు

image

ఆసుపత్రికి వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన ఘటన శివంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి (18) ఓ పరిశ్రమలో కూలీగా పనిచేస్తుంది. ఈనెల 19న తూప్రాన్ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 22, 2025

కరీంనగర్: ఓపెన్ పదో, ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

image

కరీంనగర్ జిల్లాలో సోమవారం ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు తెలిపారు. పదో తరగితి పరీక్షకు 3 పరీక్షా కేంద్రాల్లో 410 మందికి 375 మంది, ఇంటర్ పరీక్షకు 4 పరీక్షా కేంద్రాల్లో 908 మందికి 839 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 3 టెన్త్ పరీక్ష కేంద్రాలో మొత్తం 62 మందికి 52 మంది హాజరైనట్లు పరీక్ష ఓపన్ స్కూల్ కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు తెలిపారు.

News April 22, 2025

గద్వాల: హోమ్ గార్డ్స్‌తో జిల్లా ఎస్పీ సమీక్ష

image

మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రొటేషన్ ద్వారా గద్వాలకు వచ్చిన 53 మంది హోమ్ గార్డ్స్‌తో జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు సోమవారం సమావేశమయ్యారు. గ్రివెన్స్ హాల్‌లో జరిగిన ఈ సమీక్షలో ఆయన మాట్లాడారు. హోమ్ గార్డ్స్ క్రమశిక్షణతో పని చేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. విధుల్లో ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

error: Content is protected !!