News March 18, 2025
నాగర్‌కర్నూల్: కానిస్టేబుల్ ఇంట్లో పాము కలకలం

స్థానిక పోలీస్ క్వార్టర్స్‌లోని ఓ కానిస్టేబుల్ ఇంట్లో నాగుపాము దర్శనం ఇవ్వడం కలకలం రేపింది. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో పోలీస్ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. అటుఇటు తిరుగుతూ మంచం కిందికివెళ్లడంతో సభ్యులు అప్రమత్తమై స్నేక్ క్యాచర్ వంశీకి కాల్ చేయడంతో అతను రెస్క్యూ చేసి పట్టుకున్నాడు. అందరు ఊపిరిపీల్చుకున్నారు.
Similar News
News November 16, 2025
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్న నిరుద్యోగులు

కొత్తగూడెంలో ఏర్పాటుచేసిన జాబ్ మేళా నిరుద్యోగుల పాలిట వరమని ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. ఆదివారం జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ముందుకు సాగాలని సీఎండీ బలరాం సూచించారు. చదువు ఒకటే మనిషి జీవితాన్ని మారుస్తుందని కలెక్టర్ తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజంలో మంచి పేరు సాధించాలని ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు.
News November 16, 2025
డిసెంబరులో గ్లోబల్ సమ్మిట్: Dy.CM భట్టి

తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, డిసెంబర్ 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇది దుబాయ్ ఫెస్టివల్‌ను మించేలా ఉంటుందన్నారు. ఈ సమ్మిట్‌లో 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తామన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీ, గచ్చిబౌలి స్టేడియం వంటి వేదికలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
News November 16, 2025
TELANGANA NEWS

✦ టోక్యో డెఫ్లింపిక్స్-2025 షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు రూ.1.20కోటి నజరానా: మంత్రి శ్రీహరి
✦ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో BJP MP ఈటల భేటీ.. కొంపల్లి ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలని, బాలానగర్-నరసాపూర్ హైవేలో, నాగార్జునసాగర్ ఎక్స్ రోడ్ వైపు ఫ్లై ఓవర్లు నిర్మించాలని విజ్ఞప్తి
✦ తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. అర్హులందరికీ ఇస్తాం: మంత్రి పొంగులేటి


