News February 25, 2026
నాగర్‌కర్నూల్: క్రీడా పాఠశాల 4వ తరగతి ప్రవేశాల దరఖాస్తులు ప్రారంభం

రాష్ట్రంలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి వి.సీతారాం తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు గడువు నిర్ణయించారు. హకీంపేట్ క్రీడా పాఠశాలలో 10 మంది బాలురు, 10 మంది బాలికలకు ప్రవేశం కల్పిస్తామని, జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు.
Similar News
News April 13, 2026
WGL: బర్త్‌డేలతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు..!

నర్సంపేటలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఉప్పరపల్లికి చెందిన చింతకింది శివకృష్ణ, మౌనిక దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు అక్షర 2020 జూన్ 3వ తేదీన జన్మించింది. రెండవ సంతానం అర్జున్ 2022, జూన్ 3వ తేదీన, మూడవ సంతానం ఆదిత్య 2024 జూన్ 3వ తేదీన జన్మించాడు. ముగ్గురూ ఒకే నెల, ఒకే తేదీన రెండేళ్ల వ్యవధిలో జన్మించడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.
News April 13, 2026
సిద్దిపేట: గొర్రెల కాపరి కూతురి సత్తా..!

బెజ్జంకి మండలం గుండారం గ్రామానికి చెందిన గొడ్డటి కోమల ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. వర్గల్‌లో సోషల్ వెల్పేర్ పాఠశాలలో చదువుతున్న ఆమె ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించింది. గొర్రెల కాపరి అయిన లచ్చయ్య కుమార్తె కోమల, పేదరికాన్ని జయించి అత్యుత్తమ మార్కులు సాధించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోమల విజయం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
News April 13, 2026
రాప్తాడు సమీపంలో ప్రమాదం.. 6ఏళ్ల బాలుడి మృతి

రాప్తాడు మండలం మరూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు గగన్ మృతి చెందాడు. పెద్దపప్పూరు మండలం సోమనపల్లికి చెందిన మమత తన కుమారుడు, తమ్ముడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గగన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తల్లితో పాటు తమ్ముడు మారుతీకి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


