News April 10, 2025
నాగర్‌కర్నూల్: చిన్నతగాదాతో భార్యాభర్తల సూసైడ్

చిన్నతగాదా భార్యాభర్తల ప్రాణాలు తీసి, 11 నెలల బాలుడిని అనాథ చేసిన ఘటన HYDహయత్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NGKLజిల్లా అమ్రాబాద్‌కు చెందిన దంపతులు నగేశ్, శిరీష బతుకుదెరువు నిమిత్తం HYD వచ్చారు. ఇటీవల వారి మధ్య చిన్న వివాదం తలెత్తగా శిరీష ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. రాత్రి బంధువుల పూచీకత్తుతో అతడిని వదిలేయగా బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయాడు.
Similar News
News November 3, 2025
యాక్సిడెంట్ల రికార్డులు లేవన్న TGSRTC.. విమర్శలు

TG: చేవెళ్ల RTC బస్సు ప్రమాదంలో 19 మంది మరణించడం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలపై OCTలో వివరాలు అడిగిన ఓ RTI కార్యకర్తకు తమ వద్ద అలాంటి రికార్డులు లేవని RTC చెప్పింది. ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నా రికార్డులు నిర్వహించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. అయితే 2017-21 వరకు 2,674 ఘటనల్లో 1,230 మంది మృతి చెందారని 2022లో ఓ దరఖాస్తుకు RTC సమాధానమిచ్చింది. ఇప్పుడు రికార్డులే లేవనడం చర్చనీయాంశంగా మారింది.
News November 3, 2025
VJA: వన్ హెల్త్ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల నివారణ లక్ష్యంగా ఒకే ఆరోగ్యం (వన్ హెల్త్) అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి ప్రారంభించారు. ప్రతి ఏటా నవంబర్ 3న వన్ హెల్త్ డే జరుపుకుంటారని చెప్పారు.
News November 3, 2025
జాప్యం చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

విజయవాడ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఇలక్కియ పాల్గొన్నారు. అందిన మొత్తం 194 ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించి, పౌరుల సంతృప్తిని నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు. సరైన కారణం లేకుండా జాప్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


