News April 10, 2025
నాగర్‌కర్నూల్: చిన్నతగాదాతో భార్యాభర్తల సూసైడ్

చిన్నతగాదా భార్యాభర్తల ప్రాణాలు తీసి, 11 నెలల బాలుడిని అనాథ చేసిన ఘటన HYDహయత్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NGKLజిల్లా అమ్రాబాద్‌కు చెందిన దంపతులు నగేశ్, శిరీష బతుకుదెరువు నిమిత్తం HYD వచ్చారు. ఇటీవల వారి మధ్య చిన్న వివాదం తలెత్తగా శిరీష ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. రాత్రి బంధువుల పూచీకత్తుతో అతడిని వదిలేయగా బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయాడు.
Similar News
News April 5, 2026
సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారా? జాగ్రత్త!

సెలబ్రిటీలు, మహిళలే లక్ష్యంగా SMలో బూతులు తిట్టేవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల రేణూ దేశాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. SMలో ఫేమస్ అవ్వాలని, యూట్యూబ్‌లో వ్యూస్ కోసమే ఇలా చేసినట్లు పలువురు నిందితులు చెప్పడం గమనార్హం. ఇలాంటి చర్యల వల్ల కెరీర్, వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాక్ స్వాతంత్య్రం హద్దు మీరకూడదంటున్నారు.
News April 5, 2026
వనపర్తి: కరెంట్ షాక్‌తో రైతు మృతి

ఏదుల మండలం గుండ్యవాల్య నాయక్ తాండ గ్రామపంచాయతీకి చెందిన కాట్రావత్ లోకేష్ (45) వ్యవసాయ పొలం వద్ద ఈరోజు ఉదయం 6:30కు కరెంట్ షాక్‌తో మరణించారు. వ్యవసాయ పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి ప్రమాదానికి గురైనట్లు బీజేపీ నేత తిరుపతి నాయక్ తెలిపారు. ఏడాది క్రితం వరకు ఆయన పోస్ట్ మెన్‌గా పనిచేశారన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 5, 2026
VZM: ట్రాక్టర్, టీవీఎస్ ఢీకొని వ్యక్తి మృతి

రేగిడి ఆమదాలవలస మండలం కాగితాపల్లి వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజాం వైపు వస్తున్న ట్రాక్టర్, ఎదురుగా వస్తున్న టీవీఎస్ బండి ఢీకొన్నాయి. టీవీఎస్‌పై ఉన్న గలావిల్లికి చెందిన చందక గోవిందరావు (37) కిందపడగా ట్రాక్టర్ అతని మీదుగా వెళ్లింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.


