News April 10, 2025

నాగర్‌కర్నూల్: చిన్నతగాదాతో భార్యాభర్తల సూసైడ్

image

చిన్నతగాదా భార్యాభర్తల ప్రాణాలు తీసి, 11 నెలల బాలుడిని అనాథ చేసిన ఘటన HYDహయత్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NGKLజిల్లా అమ్రాబాద్‌కు చెందిన దంపతులు నగేశ్, శిరీష బతుకుదెరువు నిమిత్తం HYD వచ్చారు. ఇటీవల వారి మధ్య చిన్న వివాదం తలెత్తగా శిరీష ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. రాత్రి బంధువుల పూచీకత్తుతో అతడిని వదిలేయగా బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయాడు.

Similar News

News March 17, 2026

ఇళ్ల నిర్మాణాలను ఉగాది నాటికి పురోగతిలోకి తీసుకురావాలి: కలెక్టర్

image

బాపట్లలో సోమవారం నిర్వహించిన వీక్షణ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఎంజిఎన్ఆర్ఈజీఎస్, గృహ నిర్మాణ శాఖ పనుల పురోగతిని సమీక్షించారు. పనుల్లో వెనుకబడిన మండల అధికారులను ప్రశ్నిస్తూ, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎంఏవై పథకంలోని ఇళ్ల నిర్మాణాలను ఉగాది నాటికి పురోగతిలోకి తీసుకురావాలని సూచించారు. పనులు ప్రారంభించని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు.

News March 17, 2026

పార్వతీపురం జిల్లాలో ఏనుగుల సంచారం

image

గరుగుబిల్లి మండలం తోటపల్లి పరిసర ప్రాంతాలలో ఉన్న పంట పొలాలలో ఏనుగులు గుంపు సోమవారం సాయంత్రం సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందారు. గత కొద్ది రోజులుగా గరుగుబిల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తూ పంటలను నాశనం చేస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తక్షణం ఏనుగుల గుంపును ఈ ప్రాంతాల నుంచి తరలించాలని రైతుల కోరుతున్నారు.

News March 17, 2026

ఆస్కార్: దురదృష్టంలో ఈమెది ఆల్ టైమ్ రికార్డు!

image

ఆస్కార్ <<19394758>>అవార్డుల<<>> విషయంలో పాటల రచయిత డయానె వారెన్‌ది ఓ దురదృష్ట గాధ. దశాబ్దాలుగా నామినేషన్లలో ఉంటున్నా చివరికొచ్చే సరికి ఆమెకు నిరాశ తప్పడం లేదు. ఇలా ఏకంగా 17 సార్లు మొండిచెయ్యే దక్కింది. ఆస్కార్ చరిత్రలో ఇదో రికార్డు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో వరుసగా 9 సార్లు ఎంపికైనా అదృష్టం మాత్రం వరించలేదు. ‘నేను కొత్త రికార్డు సృష్టించా. మీరు అనుమతిస్తే మరోసారి తిరిగొస్తా’ అని FBలో వారెన్ రాసుకొచ్చారు.