News April 5, 2024
నాగర్‌కర్నూల్ జిల్లాకు ఎల్లో అలర్ట్..
నాగర్ కర్నూల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు అధికంగా నమోదు అవుతాయని, తీవ్రమైన వడగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళలో అత్యవసరమైతే బయటకు వెళ్లాలని, పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
Similar News
News January 24, 2025
పాలమూరు నుంచి డిండికి నీటి మళ్లింపు
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి డిండికి నీటి మళ్లింపు నిర్ణయం ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆమోదం తెలపడం, తాజాగా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇంత జరుగుతున్నా జిల్లా MLAలు, ప్రజాప్రతినిధుల మౌనం జిల్లా వాసులను కలవర పెడుతోంది. దీనిపై ఆందోళనలు ఉద్ధృతం చేసేందుకు పాలమూరు అధ్యయన వేదిక ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
News January 24, 2025
MBNR: ప్రభుత్వ ఉద్యోగుల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రద్దు !
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందిన ఉద్యోగులపై కలెక్టర్ విజయేందిర కొరడా ఝుళిపించారు. వారికి కేటాయించిన ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అనర్హులకు డబుల్ ఇళ్ల కేటాయించారన్న ఫిర్యాదులపై విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ, రిటైర్డ్, పెన్షనర్లు ఇళ్లు పొందినట్లు తేలింది. దీంతో నిబంధనలు అతిక్రమించిన ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాని చెప్పారు.
News January 24, 2025
పాలమూరు ఎత్తిపోతలకు పీఆర్ఎల్ఐ పథకంగా నామకరణం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి పీఆర్ఎల్ఐ పథకంగా పేరు పెడుతూ.. నీటిపారుదల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.