News April 12, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాకు చేరిన 35,710 పాఠ్యపుస్తకాలు

NGKL జిల్లాలోని జిల్లా పరిషత్, మండల పరిషత్, ఆదర్శ, గురుకుల, కేజీబీవీ కలుపుకొని 939 పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో 72,641 విద్యార్థులున్నారు. వారికి ఆరు లక్షల వరకు పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయి. 2026-26 విద్యా సంవత్సరానికి గాను ముందస్తుగా 35,710 పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మిగతా పుస్తకాలు అందుతాయని డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు.
Similar News
News November 25, 2025
వరంగల్: అన్ని పార్టీల చూపు మల్లమ్మ వైపే..?

WGL(D) సంగెం(M) ఆశాలపల్లిలో ఎస్సీ జనాభా లేకపోయినా 2011 లెక్కల్లో పొరపాటుతో సర్పంచ్ స్థానం SC మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలో ఒక్క SCగా 60ఏళ్ల కొంగర మల్లమ్మ ఉండటంతో ఆమెకే జాక్‌పాట్. మొత్తం 1,647 ఓట్లున్న ఈ గ్రామంలో ఇప్పుడు మల్లమ్మ ప్రజెంట్ ఫేవరెట్‌గా మారింది. ఇప్పటికే కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు కూడా ఆమెను సంప్రదిస్తున్నాయట. ప్రేమవివాహం చేసుకున్న BC-SC దంపతులపైనా పార్టీల దృష్టి పడినట్లు సమాచారం.
News November 25, 2025
అక్కడ ఆయన.. ఇక్కడ ఈయనపై విచారణ..!

తిరుమల వివాదాల్లో ఇద్దరు రాజకీయ నాయకులను ప్రత్యేక దర్యాప్తు బృందాలు విచారించాయి. కల్తీ నెయ్యి కేసులో HYDలో వైవీ సుబ్బారెడ్డిని సీబీఐ సిట్, పరకామణీ కేసులో తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డిని సీఐడీ విచారించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎన్నడు లేనివిధంగా టీటీడీలో చోటుచేసుకున్న వివాదాలు.. మాజీ ఛైర్మన్ల విచారణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News November 25, 2025
ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే ఐబొమ్మ రవి దొరికాడు: పోలీసులు

TG: ఐబొమ్మ రవికి కష్టపడి జాబ్ చేయాలన్న ఆలోచన లేదని సైబర్ క్రైమ్ అడిషనల్ CP శ్రీనివాస్ వెల్లడించారు. ‘టెక్నాలజీ తెలుసు. ఈజీ మనీ కోసం సినిమాలను పైరసీ చేశాడు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే రవి దొరికాడు. అతడి భార్య మాకు సమాచారం ఇచ్చిందనేది అవాస్తవం. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రూ.20 కోట్ల వరకు సంపాదించాడు. మూవీరూల్జ్, తమిళ్ఎంవీ లాంటి పలు పైరసీ సైట్ల నిర్వాహకులను పట్టుకుంటాం’ అని స్పష్టం చేశారు.


