News February 20, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు.!

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో రోజురోజుకీ ఎండ తీవ్రత పెరుగుతోంది. గురువారం ఉదయం అమ్రాబాద్‌లో 33.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. జిల్లావ్యాప్తంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వాహనదారులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Similar News

News September 16, 2025

సంగారెడ్డి: పాఠశాలల పర్యవేక్షణకు అధికారుల నియామకం

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి అధికారులను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాకు రమణ కుమార్‌ను నియమించారని పేర్కొన్నారు. వీరు జిల్లాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించనున్నారని తెలిపారు.

News September 16, 2025

‘షేక్‌ హ్యాండ్’ వివాదంలో పాక్‌కు మరో ఎదురుదెబ్బ!

image

ఆసియా కప్: పాక్ ప్లేయర్లకు సూర్య స్క్వాడ్ షేక్‌ హ్యాండ్ ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. అది నిబంధనలకు విరుద్ధమని ICCకి PCB ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని, లేకపోతే UAEతో మ్యాచ్ ఆడమని పాక్ బెదిరించింది. పాక్ బెదిరింపులను ICC తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ‘అందులో మ్యాచ్ రిఫరీ పాత్ర లేదని, షేక్‌హ్యాండ్ ఇవ్వాలని MCC మాన్యువల్‌లో లేదు’ అని ICC తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.

News September 16, 2025

హాస్టళ్ల నిర్మాణం-మరమ్మతులకు నిధులు: CBN

image

AP: SC, ST, BC హాస్టళ్లలో వసతులు మెరుగవ్వాలని CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు కేంద్రం నుంచి పావలా వడ్డీ కింద రుణం వస్తుంది. ఆ వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేలా విధానాలను రూపొందించండి. సంక్షేమ హాస్టళ్ల పునర్నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేయండి. SC, ST హాస్టళ్లలో చదివే విద్యార్థులు IIT, IIM వంటి సంస్థల్లో సీట్లు సాధించేలా మరింత కృషి చేయాలి’ అని తెలిపారు.