News April 6, 2025
నాగర్కర్నూల్ జిల్లాలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని సింగోటం క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పెంట్లవెల్లి వాసి గార్డుల లేవన్న(45) పనిమీద పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్కి వెళ్లాడు. తిరిగొస్తుండగా శనివారం రాత్రి కొల్లాపూర్లోని సింగోటం క్రాస్ రోడ్డు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని రాంగ్ రూట్లో వెళ్లి బైక్తో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
Similar News
News November 28, 2025
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతుల్లో ప్రవేశాలకు గడువును డిసెంబర్ 7 వరకు పొడిగించినట్లు జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మండలంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 28, 2025
2045 నాటికి 100% ఎలక్ట్రిక్ బస్సులు!

TG: రాష్ట్రంలో 2045 నాటికి 100% ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు RTC ప్రభుత్వానికి తెలిపింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీ సందర్భంగా ఈ మేరకు వివరించింది. 2035 నాటికి 30% ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామంది. వరంగల్, ఖమ్మం తదితర జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లతో పాటు హైవేలపై ఉన్న డిపోలను ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సెంటర్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది.
News November 28, 2025
నేడు క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరగనుంది. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్, SIPBలో ఆమోదం పొందిన పలు ప్రాజెక్టులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాలపైనా సమగ్రంగా చర్చిస్తారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల సన్నద్ధతమైనా చర్చించే అవకాశం ఉంది.


