News April 16, 2025
నాగర్కర్నూల్ జిల్లాలో యాక్సిడెంట్.. ఇద్దరి మృతి

నాగర్కర్నూల్ జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దేవరకొండ నుంచి చారకొండ మధ్యలో ఎర్రగుంటపల్లి వద్ద బైక్పై వస్తున్న ఇద్దరిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మరణించారు. మృతులు కార్తీక్ చారి సబ్ స్టేషన్లో పనిచేస్తుండగా అరవింద్ చారి బస్టాప్ వెనుక మీల్స్ హోటల్ నడుపుతున్నాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 20, 2025
నిజామాబాద్: NPOs/NGOs దరఖాస్తు చేసుకోవాలి: DYSO

2025-26 సంవత్సరానికి జాతీయ యువత, కౌమార అభివృద్ధి కార్యక్రమం (NPYAD) పథకం కింద గ్రాంట్-ఇన్-ఎయిడ్ (ఆర్థిక సహాయం) కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DYSO పవన్ కుమార్ తెలిపారు. ఈ పథకం కింద అర్హత కలిగిన లాభాపేక్షలేని సంస్థలు (NPOs/NGOs) నుంచి ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 20, 2025
రైతులకు బాబు వెన్నుపోటు: YCP

AP: ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబు రైతులకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ విమర్శించింది. అన్నదాత సుఖీభవ పథకం తొలి రెండు విడతల్లో <<18329772>>7 లక్షల మంది<<>> లబ్ధిదారులను తొలగించారని ఆరోపించింది. వైసీపీ హయాంలో 53.58 లక్షల మందికి ఈ పథకం కింద డబ్బులు అందేవని వెల్లడించింది. అలాగే పంటలకు మద్దతు ధరలు కూడా ఇవ్వట్లేదని ట్వీట్ చేసింది.
News November 20, 2025
రాజన్న ఆలయ ఏఈఓకు ప్రచార రథం బాధ్యతలు అప్పగింత

వేములవాడ రాజన్న ఆలయం సహాయ కార్య నిర్వహణాధికారి బ్రహ్మన్నగారి శ్రీనివాస్కు స్వామి వారి ప్రచార రథం ఏఈఓగా బాధ్యతలు అప్పగించారు. అభివృద్ధి పనుల నిమిత్తం రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేసి ప్రచార రథం వద్ద దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ భక్తులకు ఇబ్బందులు కలగకుండా శ్రీనివాస్కు ప్రచార రథం వద్ద అదనపు బాధ్యతలు అప్పగించారు. భీమేశ్వరాలయంతో పాటు మరికొన్ని విభాగాలకు ఆయన ఏఈఓగా కొనసాగుతారు.


