News March 19, 2025
నాగర్కర్నూల్ జిల్లాలో విషాదం.. మహిళ ఆత్మహత్య

ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బిజినపల్లి వాసి బత్తుల లక్ష్మి(48) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. చుట్టుపక్కల వారు గమనించేసరికి ఇంట్లో మంటలు ఎగిసిపడి అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సయ్యద్ అలీ తెలిపారు.
Similar News
News March 19, 2025
పల్నాడు: 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీలు

నకరికల్లులోని పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ పి.అరుణ్ బాబు బుధవారం సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. పరీక్షా హాలు వద్ద మంచినీరు అందుబాటులో ఉంచాలని, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులలో లోపాలు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, ఎంఈఓలు, ఉపాధ్యాయులు ఉన్నారు.
News March 19, 2025
దేశంలోనే అత్యంత ధనిక MLA ఇతనే

దేశంలోని 4,092 MLAల ఆస్తులపై ఏడీఆర్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ముంబైలోని ఘాట్కోపర్ ఈస్ట్ శాసనసభ్యుడు పరాగ్ షా(BJP) దేశంలోనే ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. రూ.3,400 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. రూ.1,413 కోట్లతో కర్ణాటక Dy.CM DK శివకుమార్(INC) రెండో స్థానంలో నిలిచారు. రూ.1,700తో దేశంలోనే అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్లోని ఇండస్ శాసనసభ్యుడు నిర్మల్ కుమార్ ధారా(BJP) నిలిచారు.
News March 19, 2025
ఈ నెల 25, 26 తేదీల్లో కలెక్టర్ల సదస్సు

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 25, 26 తేదీల్లో సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరు, పీ4 విధానంపై చర్చించనున్నారు. వాట్సాప్ గవర్నెన్స్, అర్హులకు పథకాల అందజేత, ఇతర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.