News March 19, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం.. మహిళ ఆత్మహత్య

image

ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బిజినపల్లి వాసి బత్తుల లక్ష్మి(48) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. చుట్టుపక్కల వారు గమనించేసరికి ఇంట్లో మంటలు ఎగిసిపడి అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సయ్యద్ అలీ తెలిపారు.

Similar News

News April 23, 2025

ముగిసిన SRH ఇన్నింగ్స్.. స్కోర్ ఎంతంటే?

image

ముంబైతో జరుగుతున్న మ్యాచులో హైదరాబాద్ ఓ మాదిరి స్కోరు చేసింది. టాపార్డర్ వైఫల్యంతో ఓవర్లన్నీ ఆడి 143/8 స్కోర్ నమోదు చేసింది. క్లాసెన్ (71) ఒంటరి పోరాటం చేశారు. జట్టు 35/5తో కష్టాల్లో ఉన్న దశలో క్లాసెన్ క్రీజులోకి వచ్చి ఆదుకున్నారు. అతడికి అభినవ్ (43) సహకారం అందించారు. హెడ్ (0), అభిషేక్ (8), ఇషాన్ (1), నితీశ్ (2) ఘోరంగా విఫలమయ్యారు. బౌల్ట్ 4, చాహర్ 2 వికెట్లు తీశారు.

News April 23, 2025

కాసేపట్లో కేంద్ర హోంశాఖ ప్రెస్ మీట్

image

పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర క్యాబినేట్ భేటీ ముగిసింది. PM మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. దాదాపు 2గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉగ్రవాదుల ఏరివేత, తదితరాలపై చర్చించారు. మరోవైపు, కేంద్ర హోంశాఖ కాసేపట్లో ఈ భేటీపై ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఉగ్రవాదుల సమాచారం తెలిపిన వారికి రూ.20లక్షల నజరానా అందిస్తామని అనంతనాగ్ పోలీసులు తెలిపారు.

News April 23, 2025

బాపట్ల జిల్లాలో 83.96% ఉత్తీర్ణత..!

image

బుధవారం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో బాపట్ల జిల్లా 83.96% ఉత్తీర్ణత సాధించింది. మొత్తం 16,182 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 13,586 మంది ఉత్తీర్ణత సాధించారు. 8,143 మంది బాలురు పరీక్షకు హాజరు కాగా 6,615మంది 81.24% తో పాసయ్యారు. 8,039 బాలికలు పరీక్షకు హాజరు కాగా 6,971మంది 86.71%తో ముందంజలో ఉన్నారు.

error: Content is protected !!