News February 2, 2025

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో తీవ్ర విషాదం

image

వేర్వేరు ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. కొండనాగులకు చెందిన జోగు మల్లయ్య(45), తిమ్మాజిపేట మండలం ఆవంచలో సత్తయ్య(42)లు ఇంట్లో చెప్పకుండా.. వారి వారి గ్రామ సమీపాల్లోని కుంటల్లో చేపలవేటకు వెళ్లారు. వారు ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు వెతకసాగారు. రెండురోజుల అనంతరం ఇద్దరూ ఆయా కుంటల్లో శవాలై ఆ ఊర్ల వారికి కనిపించారు. ఈ ఘటనలపై కేసునమోదైనట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News October 20, 2025

సత్యభామలా ఆత్మస్థైర్యంతో ఉందాం..

image

నరకాసురుడితో యుద్ధం చేసి చంపడంలో శ్రీకృష్ణుడికి సత్యభామ సహకరిస్తుంది. మనలోని నిరాశ, అలసత్వం, పిరికితనం వంటి బలహీనతలను నరకసారుడిగా భావించి ధైర్యం, అప్రమత్తత, తెగింపు, ఆత్మస్థైర్యం, చురుకుదనంతో అతివలు పోరాడాలి. ఎక్కడ ప్రేమను చూపాలో, ఎక్కడ విజృంభించాలో తెలిసిన శక్తిస్వరూపుణి సత్యభామ. నేటితరం యువతులు ఆ గుణాలను ఆకళింపు చేసుకుంటే జయం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది.
* స్త్రీమూర్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

News October 20, 2025

పోలీసు అమరవీరుల వారోత్సవాల షెడ్యూల్ ఇదే

image

జిల్లాలో అమరులైన పోలీసుల జ్ఞాపకార్థం నిర్వహించే ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల దినోత్సవం) వారోత్సవాలను ఈ నెల 21 నుంచి 24 వరకు ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 21న హెడ్ క్వార్టర్స్‌లో అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్, ఎస్పీ నివాళులర్పిస్తారు. 22న మెగా రక్తదానం, 23న ఓపెన్ హౌస్, సైకిల్ ర్యాలీ, 24న 2000 మంది విద్యార్థులతో 5కే రన్ ఉంటుంది.

News October 20, 2025

మేకప్ తీయడానికి ఈ జాగ్రత్తలు

image

మేకప్ వేసుకోవడంలోనే కాదు దాన్ని తీసే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. లేదంటే ముఖ చర్మం దెబ్బతింటుంది. మేకప్ తీసేటపుడు ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు. కాటన్ ప్యాడ్‌పై మేకప్ రిమూవర్ వేసి ముఖానికి అద్ది కాసేపటి తర్వాత క్లీన్ చెయ్యాలి. కళ్ల చివర్లు, పెదాలు, మెడ, చెవులు, హెయిర్‌లైన్‌ ప్రాంతాల్లోనూ మేకప్ తియ్యాలి. కుదిరితే ముఖానికి ఆవిరి పట్టి ఫేస్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.