News April 21, 2025
నాగర్‌కర్నూల్: ‘పిల్లలను GOVT స్కూళ్లలో చేర్పించండి’

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు బలోపేతం కావాలనే సర్కార్ లక్ష్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నామని ఆ ఉపాధ్యాయ బృందం పేర్కొంది. బల్మూర్ మండలంలోని పోలిశెట్టిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అందించే విద్యాప్రమాణాలు, సౌకర్యాలు ప్రైవేట్ స్కూల్స్‌కి ఏ మాత్రం తీసిపోవని హెచ్ఎం సోమాని ఆధ్వర్యంలో పేరెంట్స్‌కు అవగాహన కల్పిస్తున్నారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నారు.
Similar News
News April 22, 2025
‘ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్య’

ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్యను నేర్చుకుని మంచి ప్రయోజకులు కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారని, నిర్ణీత విద్య అర్హతలతోపాటు పోటీ పరీక్షలలో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయులుగా పాఠశాలలో నియమించడం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందన్నారు.
News April 22, 2025
48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు: ఉత్తమ్

TG: రబీ సీజన్‌లో ధాన్యం దిగుబడికి అనుగుణంగా గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. రైతు మహోత్సవంలో ఆయన మాట్లాడారు. పంట చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం నీటి పారుదల రంగంపై రూ.81వేల కోట్లు వెచ్చించినా ఏమీ సాధించలేదని దుయ్యబట్టారు.
News April 22, 2025
నిర్మల్ : పోలీసులపై నమ్మకం పెరిగేలా పనిచేయాలి: SP

ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని ఆయా కేసుల్లో నిందితులకు పడే శిక్షల శాతం మరింత పెరిగేలా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. పట్టణాల్లో దొంగతనాలు జరగకుండా రాత్రి వేళలో గస్తీని మరింత పెంచాలన్నారు.