News April 2, 2025
నాగర్కర్నూల్: పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్సీ

రాష్ట్రంలోని పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో CM రేవంత్ రెడ్డి ఉగాది పండుగ సందర్భంగా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా NGKLలో సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు. పేద ప్రజల ఆకలి తీరేలా కృషి చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Similar News
News December 10, 2025
నేడు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఈ రోజు ఉ.11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఓయూ సమగ్ర అభివృద్ధి కోసం రూ.1,000 కోట్ల నిధుల హామీ నేపథ్యంలో, కొత్త హాస్టల్ భవనం, లా కాలేజ్, 2500 సీట్ల ఆడిటోరియం సహా అనేక నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
News December 10, 2025
దేశంలో పెరిగిన అమ్మాయిల సగటు వివాహ వయస్సు

దేశంలో బాలికల సగటు వివాహ వయస్సు 22.9 సంవత్సరాలకు చేరుకుందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో అమ్మాయిల సగటు వివాహ వయస్సు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో బాలికల వివాహ వయస్సు సగటున 22.1 సంవత్సరాలుగా ఉంది. ఇది 2020లో 22.7కి పెరిగింది. 2021లో ఇది 22.5 కాగా, 2022లో ఇది 22.7కి చేరుకుంది.