News March 28, 2025

నాగర్‌కర్నూల్: బాలికపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

image

ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్ఐ మాధవరెడ్డి తెలిపిన వివరాలు.. కల్వకుర్తి మండలం వెంకటాపూర్ వాసి అనిల్ గౌడ్ అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

Similar News

News November 25, 2025

జనగామ: స్థానిక ఎన్నికలు.. ఆశావహులకు నిరాశే!

image

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశావహులకు నిరాశే మిగిలింది. తొలుత విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం కొంతమంది ఎన్నికలకు పోటీ చేద్దాం అని సిద్ధమయ్యారు. కానీ ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌లో రిజర్వేషన్‌లు తారుమారు కావడంతో ముందు ఆశించిన వారు నిరాశ పడ్డారు. కొందరు కొంత మేర డబ్బులు సైతం ఖర్చు పెట్టుకున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

News November 25, 2025

శిశుగృహ ఘటనపై చర్యలు.. ఏడుగురి తొలగింపు?

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శిశుగృహ పసిబిడ్డ మృతి ఘటనకు బాధ్యులైన ఏడుగురిని తొలగిస్తూ అనంతపురం జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. శిశుగృహ మేనేజర్ దీప్తి, సోషల్ వర్కర్, ఏఎన్‌ఎం, ముగ్గురు ఆయాలు, వాచ్‌మెన్‌తో సహా మొత్తం ఏడుగురిని తొలగిస్తూ కలెక్టర్ ఆనంద్ నిర్ణయం తీసుకున్నారు. ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి ఈ విషయాన్ని ధృవీకరించారు. శిశు గృహంలో పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన జారీ చేసే అవకాశముంది.

News November 25, 2025

వినూత్న నిరసన.. ఉల్లిగడ్డలకు అంత్యక్రియలు

image

మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు తగ్గడంపై రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మాండ్సౌర్ జిల్లాలోని ధమ్నార్‌లో ఉల్లిగడ్డలను పాడెపై పేర్చి అంత్యక్రియలు చేశారు. దేశంలో అత్యధికంగా ఉల్లి సాగు చేసే ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న మాల్వా-నిమర్‌లో కేజీ రూపాయి పలుకుతున్నట్లు వాపోయారు. పండించేందుకు రూ.10-12 ఖర్చు అవుతుందని, ధరలు తగ్గడంతో నష్టాలే మిగులుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.