News March 28, 2025

నాగర్‌కర్నూల్: బాలికపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

image

ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్ఐ మాధవరెడ్డి తెలిపిన వివరాలు.. కల్వకుర్తి మండలం వెంకటాపూర్ వాసి అనిల్ గౌడ్ అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

Similar News

News December 1, 2025

అనకాపల్లి: తుఫాను భయం.. రైతులకు సూచనలివే

image

దిత్వా తుఫాన్ నేపథ్యంలో రైతులు వరికోతలను రెండుమూడు రోజులు వాయిదా వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి విజ్ఞప్తి చేశారు. పరిస్థితిలు అనుకూలించిన తర్వాత మాత్రమే కోతలు ప్రారంభించాలన్నారు. కోసిన వరి పనలు తడిస్తే నూర్చి ఎండలో ఎండ పెట్టాలన్నారు. ప్రతి క్వింటాల్ ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల ఊకపొడి కలపాలన్నారు. మొలకలు రాకుండా ఉండేందుకు ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయాలన్నారు.

News December 1, 2025

చీడికాడ: గంజాయి కేసులో నలుగురికి 10 ఏళ్లు జైలు శిక్ష

image

చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో నమోదైన గంజాయి కేసులో నలుగురు నిందితులకు 10ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు, ఒక్కొక్కరికీ రూ.లక్ష జరిమానా విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎం.హరినారాయణ తీర్పు చెప్పినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన వివరాలు వెల్లడించారు. ధరావత్ రవి, మడ్డు నర్సింహరాజు, దాలిబోయిన ఫల్గుణ, బండారు సంతోష్‌లకు ఈ శిక్ష పడినట్లు చెప్పారు.

News December 1, 2025

కృష్ణా: తుఫాన్ ప్రభావంతో అపరాల సాగు ఆలస్యమే.!

image

దిత్వా తుఫాన్ ప్రభావం కృష్ణా డెల్టా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సాధారణంగా వరి కోత అనంతరం రెండో పంటగా సాగుచేసే అపరాల సాగుకు నవంబర్ నెలలోనే పనులు ప్రారంభమవుతాయి. అయితే తుఫాన్ నేపథ్యంతో వరికోతలు నిలిచిపోవడంతో, అపరాల సాగు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. రెండో పంట ఆలస్యమవ్వడంతో దిగుబడి కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.