News March 28, 2025
నాగర్‌కర్నూల్: బాలికపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్ఐ మాధవరెడ్డి తెలిపిన వివరాలు.. కల్వకుర్తి మండలం వెంకటాపూర్ వాసి అనిల్ గౌడ్ అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
Similar News
News January 4, 2026
ఇంద్రవెల్లి: పాముకాటుతో బాలుడి మృతి

ఇంద్రవెల్లి మండలం సకారాం తాండకు చెందిన దయారాం భాగ్యశ్రీ దంపతులకు కుమారుడు విశ్వనాథ్ (4) పాము కాటుతో మృతి చెందాడు. శుక్రవారం పిల్లలతో కలిసి రేగి పండ్లు చెట్టు వద్దకు వెళ్లి పండ్లు తింటున్న సమయంలో పాము కాటేసింది. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
News January 4, 2026
పాక్ తరహాలోనే బంగ్లాతోనూ క్రికెట్ కష్టమే!

పాక్ తరహాలోనే బంగ్లాదేశ్‌తోనూ భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం కష్టంగానే కనిపిస్తోంది. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులే దానికి కారణం. SEPలో భారత్ తమ దేశంలో పర్యటిస్తుందని BCB ప్రకటించింది. కానీ BCCI దానిని కన్ఫామ్ చేయలేదు. పైగా IPL నుంచి బంగ్లా ఆటగాడు ముస్తఫిజుర్‌ను తప్పించారు. దీంతో బంగ్లా కూడా T20WC మ్యాచులు భారత్‌లో ఆడకూడదని, తమ వేదికలు మార్చాలని ICCని కోరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
News January 4, 2026
జనవరి 4: చరిత్రలో ఈరోజు

* 1643: శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్(ఫొటోలో లెఫ్ట్) జననం
* 1809: బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయీ బ్రెయిలీ జననం
* 1889: భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎం.పతంజలి శాస్త్రి జననం
* 1945: నటుడు, దర్శకుడు ఎస్.కె.మిశ్రో జననం
* 1994: సంగీత దర్శకుడు రాహుల్ దేవ్ బర్మన్ మరణం
* 2015: నటుడు ఆహుతి ప్రసాద్ మరణం
– ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం


