News April 19, 2025

నాగర్‌కర్నూల్: మహిళపై గ్యాంగ్ రేప్.. సీన్ రీకన్‌స్ట్రక్షన్

image

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వారిని విచారిస్తున్నారు. శుక్రవారం నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. గతంలో నిందితులు ఏమైనా నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం.

Similar News

News December 16, 2025

GNT: శాబర్‌ జెట్‌ను కూల్చిన ఆంధ్ర వీరుడు

image

1965 ఇండో-పాక్ యుద్ధంలో పాకిస్థాన్ శాబర్‌ జెట్‌ను కూల్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి తెనాలి సమీప నిజాంపట్నానికి చెందిన హవల్దార్ తాతా పోతురాజు. పాత ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌తో శత్రు విమానాన్ని ఛేదించి భారత సైన్యానికి స్ఫూర్తినిచ్చారు. ఈ వీరోచిత సేవలకు రాష్ట్రపతి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ‘వీరచక్ర’ పురస్కారం అందుకున్నారు. 18 ఏళ్లకే సైన్యంలో చేరిన పోతురాజు 1975లో స్వచ్ఛంద విరమణ చేశారు.

News December 16, 2025

145 సర్పంచ్ స్థానాలకు తుది విడత ఎన్నికలు

image

తుది విడతలో మొత్తం 145 సర్పంచ్, 1,330 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిలో 256 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఆళ్లపల్లి(M) అడవి రామవరం గ్రామపంచాయతీ 1వ వార్డు నామినేషన్ తిరస్కరణ కావడం, అభ్యర్థులు లేని కారణంగా 3వ వార్డు, ఇల్లందు మండలం బోయితండా ఆరో వార్డుకు నామినేషన్లు దాఖలు కాలేదని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మిగిలిన 1,071 వార్డు స్థానాలకు ఎన్నికలు ఉంటాయన్నారు.

News December 16, 2025

ఇందిరమ్మ ఇళ్లకు మరో ₹5,000Cr.. త్వరలో ఖాతాల్లోకి!

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిధుల కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల హడ్కో నుంచి ₹5,000Cr లోన్ తీసుకుంది. క్యాబినెట్ ఆమోదించాక వాటిని లబ్ధిదారులకు జమ చేసే అవకాశముంది. GHMC, అర్బన్ ఏరియాల్లో టవర్ల పద్ధతిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకూ ఈ నిధులనే వినియోగించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48L ఇళ్ల పనులు జరుగుతున్నాయి. 2026 MAR నాటికి లక్ష గృహప్రవేశాలు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం.