News April 7, 2025
నాగర్కర్నూల్: ‘మాంసం వారానికి ఒకసారే తినండి’

ఉమ్మడి <<16019120>>పాలమూరులో<<>> 18 ఏళ్లు పైబడిన వారిలో సగటున 20 శాతం అంటే 87,739 మంది అధిక రక్తపోటు బాధితులే ఉన్నారు. క్యాన్సర్ రోగులు 188 మంది, మధుమేహ వ్యాధిగ్రస్థులు 50,421 మంది ఉన్నారు. మటన్, ఆయిల్ఫుడ్, అధిక ఉప్పు, పచ్చడి, తంబాకు, గుట్కా, బ్రెడ్, బేకరీ ఫుడ్ తినొద్దని, స్కిన్లెస్ చికెన్, గుడ్డు తెల్ల సొన, ఉడకబెట్టిన కూరగాయలు, పాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వారానికి ఒకసారి మాత్రమే మాంసం తినాలన్నారు.
Similar News
News November 4, 2025
అల్లూరి జిల్లాలో కూరగాయలు ధరలకు రెక్కలు

అల్లూరి జిల్లాలో కూరగాయలు ధరలు విపరీతంగా పెరిగాయి. పాడేరులో గత వారం చిక్కుడు కాయలు కిలో రూ.100ఉండగా నేడు 160కి వీరిగిపోయింది. అల్లం కిలో రూ.60 ఉండగా నేడు రూ.120కి పెరిగిందని వినియోగదారులు తెలిపారు. భారీ వర్షాలు కురవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లో సాగు చేస్తున్న కూరగాయలు తోటలు వర్షాలకు దెబ్బ తినడంతో ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
News November 4, 2025
నర్సంపేట: పెన్సిల్ మొనపై కార్తీక దీపం..!

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత, మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామోజు జయకుమార్ తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని, పెన్సిల్ (లెడ్) మొనపై దీపపు ప్రమిదను చెక్కి, అందులో నూనెతో కూడిన వత్తిని వేసి వెలిగించాడు. జయకుమార్ కనబరిచిన ఈ సూక్ష్మ ప్రతిభ పట్ల డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 4, 2025
బాల్య వివాహాలను నిర్మూలించడం ప్రతి పౌరుడి బాధ్యత: కలెక్టర్

బాల్య వివాహాలను నిర్మూలించడం ప్రతి పౌరుడి బాధ్యత అని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయిలకు 18 సంవత్సరాల నిండకుండా పెళ్లి చేయడం నేరమని చెప్పారు. బాల్య వివాహన చట్టం ప్రకారం బాల్య వివాహాలను చేస్తే తల్లిదండ్రుల పైనే కాకుండా వివాహానికి హాజరైన వారు, ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులేనని తెలిపారు.


