News March 20, 2025
నాగర్కర్నూల్: ముగిసిన ఇంటర్ పరీక్షలు..

ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 33 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 5 నుంచి పరీక్షలు జరిగాయి. ద్వితీయ సంవత్సరం 5,996 మంది విద్యార్థులకు గానూ 207 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నాగర్ కర్నూల్ జిల్లా ఇంటర్ నోడల్ అధికారి జి.వెంకటరమణ తెలిపారు. గురువారం పరీక్షలు పూర్తికావడంతో విద్యార్థులు కేంద్రాల నుంచి ఉత్సాహంతో బయటకు వచ్చారు. దీంతో బస్టాండ్లు విద్యార్థులతో కిక్కిరిశాయి.
Similar News
News March 31, 2025
MI మినహా..!

IPL ప్రారంభమై 10రోజులవుతోంది. MI మినహా జట్లన్నీ గెలుపు ఖాతా తెరిచాయి. ఆడిన 2మ్యాచ్ల్లోనూ ముంబై ఓడింది. గతంలో తొలి 5మ్యాచులు ఓడినా తిరిగి పుంజుకొని టైటిల్ గెలిచిన సందర్భమూ ఉంది. అయితే జట్టు కూర్పు సరిగా లేకపోవడమా? కెప్టెన్లు మారడమా? టాప్ ఆర్డర్ వైఫల్యమా? తదితర కారణాలపై MI త్వరగా దృష్టి పెట్టకపోతే టైటిల్ రేసులో వెనకబడటం ఖాయం. ఇవాళ KKRతో జరిగే మ్యాచ్లో అయినా గెలవాలని MI ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News March 31, 2025
గ్రూప్-1లో సత్తాచాటిన సంస్థాన్ నారాయణపురం ఏఓ

సంస్థాన్ నారాయణపురం మండల వ్యవసాయ అధికారిణి కే. వర్షిత గ్రూప్-1లో సత్తాచాటారు. నాలుగు నెలల క్రితం ఏఓగా భాద్యతలు చేపట్టిన వర్షిత గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్స్లో రాష్ట్ర స్థాయిలో 100వ ర్యాంక్, మల్టీజోన్-2లో 40 ర్యాంకు సాధించారు. ఇటీవలే ప్రకటించిన గ్రూప్-4లో 143, గ్రూప్-2లో 215వ ర్యాంక్ సాధించి తన ప్రతిభను చాటారు. ఈ జాబ్స్ అన్నీ మొదటి ప్రయత్నంలోనే సాధించడం విశేషం.
News March 31, 2025
కొడాలి నాని హెల్త్ అప్డేట్

వైసీపీ నేత కొడాలి నాని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారం క్రితం ఛాతినొప్పితో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారించారు. స్టెంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. సర్జరీ కోసం కొంత సమయం తీసుకోవాలని కుటుంబసభ్యులు యోచిస్తున్నారు. నానిని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కు తరలించే అవకాశం ఉంది.