News April 16, 2025
నాగర్‌కర్నూల్: యాక్సిడెంట్‌లో చనిపోయింది వీళ్లే..!

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ-దేవరకొండ రోడ్డులో <<16112661>>ఎర్రగుంటపల్లి<<>> వద్ద మంగళవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్‌లో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. కల్వకుర్తికి చెందిన కార్తిక్, అరవింద్ పని నిమిత్తం బైక్‌పై దేవరకొండకు వెళ్లారు. తిరిగొస్తుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 19, 2025
రేపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి నారా లోకేశ్

మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఆయన స్వీకరించనున్నారు. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో లోకేశ్ భేటీ కానున్నారు. పార్టీ వ్యవహారాలు, ప్రజా సమస్యలపై చర్చ జరగనున్నట్లు సమాచారం.
News December 19, 2025
గన్ని కృష్ణకు పీజీ పట్టా అందించిన మంత్రి లోకేశ్

ఏడు పదుల వయసులో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పట్టాను అందజేశారు. శుక్రవారం రాజమండ్రిలో జరిగిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమావేశంలో గన్ని కృష్ణను లోకేష్ అభినందించారు. ఈ వయసులో చదివి పట్టా సాధించడం నేటి యువతకు ఆదర్శవంతమన్నారు. విద్య ద్వారానే జ్ఞాన సముపార్జన సాధ్యమని లోకేశ్ పేర్కొన్నారు.
News December 19, 2025
ఆ రోజే సూసైడ్ చేసుకోవాల్సింది: హీరోయిన్

మలయాళ హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్ <<18547134>>కేసులో<<>> ఆరుగురికి 20 ఏళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. నిందితుల్లో ఒకరైన మార్టిన్ ఆంటోనీ బాధితురాలి ఐడెంటిటీని వెల్లడించడంపై ఆ హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నన్ను ఇలా బతకనివ్వండి. ఘటనపై ఫిర్యాదు చేసి తప్పు చేశా. ఆ రోజే నేను చనిపోవాల్సింది. మీ ఇంట్లో ఇలాంటి పరిస్థితి రావొద్దని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. తన పేరు వెల్లడించడంపై చర్యలు తీసుకోవాలని కోరారు.


